త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో వీసీలు, అధ్యాపక పోస్టుల భర్తీ : గవర్నర్ 

  • Publish Date - May 29, 2020 / 11:25 AM IST

అన్ని యూనివర్సిటీల సమగ్ర సమాచారం తెప్పిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. సమగ్ర సమాచారంతో బ్లూప్రింట్ తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో వీసీలు, అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. 

ప్రైవేట్ వర్సిటీలకు ధీటుగా ప్రభుత్వ వర్సిటీల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెప్పారు. యూనివర్సిటీల్లో ట్రిపుల్ ఈ పద్ధతి ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఎంజాయ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ మెంట్ విధానాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. 

కోవిడ్ నేపథ్యంలో హాస్టళ్లను ఎలా తెరవాలన్న అంశంపై చర్చిస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీల భూముల ఆక్రమణ తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 

Read: రైతులకు CM KCR చెప్పే తీపి కబురేంటీ ?