Adhika Masam 2026 : అత్యంత పవిత్రమైన అధిక మాసం.. ఈ మంత్రాలు పఠిస్తే.. అప్పుల బాధలు తొలగి.. మీ ఇంట కనక వర్షం..!
Adhika Masam 2026 : అప్పుల ఊబిలో కూరుకున్న వారు ఈ అధిక మాసంలో ఈ మంత్రాన్ని జపిస్తే కనకవర్షం కురుస్తుంది అంటున్నారు.
- Dharani Pilli
- Updated on- May 18, 2026 / 07:31 PM IST
adhika masam 2026 chanting these mantras for wealth and goddess lakshmi blessings
Adhika Masam 2026 : సూర్యుడు 12 రాశుల్లో ప్రవేశిస్తూ తన గమనాన్ని పూర్తి చేస్తే… చంద్రుడు మాత్రం నక్షత్రాల ఆధారంగా చేసుకొని తన గమనాన్ని కొనసాగిస్తాడు. ఈ సౌర–చాంద్ర గమనాల్లో ఉన్న స్వల్ప వ్యత్యాసం కారణంగా కొన్ని సంవత్సరాలకు ఒకసారి అదనపు చాంద్రమాసం ఏర్పడుతుంది. దీనినే “అధిక మాసం” అంటారు. అయితే హిందూ ధర్మశాస్త్రాల్లో ఈ అధిక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని పరమపవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. సాధారణంగా ప్రతి 32 నెలలకు ఒకసారి లేదా మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. దీనిని ‘పురుషోత్తమ మాసం’ అని కూడా పిలుస్తారు.
అధిక మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. మిగతా రోజులతో పోలిస్తే ఈ సమయంలో చేసే దానధర్మాలు, పూజా కార్యక్రమాల వల్ల కొన్ని వందల రెట్లు ఎక్కువగా పుణ్య ఫలం, ప్రయోజనం దక్కుతుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ సంవత్సరం మే 17వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం ఉంటుంది. అయితే ఈ సారి అధిక మాసానికి మరో విశేషం ఉంది. అదేంటంటే.. ఈసారి ‘జ్యేష్ఠ మాసం’లో అధిక మాసం రాబోతోంది.
జీవితంలో దీర్ఘకాలంగా ఆర్థిక, వైవాహిక వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ అధిక మాసం ఒక వరం లాంటిది. విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నెలలో ఆయన తన భక్తుల మీద ఎనలేని కరుణ చూపిస్తారని విశ్వాసం. అందుకే ఈ మాసంలో పలు సమస్యలతో బాధపడే వారు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పఠిస్తే సమస్యలు తీరతాయంటున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు..
ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా.. లేదంటే ఎక్కడైనా మీ డబ్బు నిలిచిపోయి ఇబ్బంది పడుతుంటే.. అలాంటి వారు ఈ అధిక మాసంలో ‘కార్తవీర్యార్జున మంత్రాన్ని’ పఠించాలని పండితులు చెబుతున్నారు. మంత్రం ఏంటంటే..
- ఓం హ్రీం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్
యస్య స్మరణ మాత్రేణ హృతం నష్టం చ లభ్యతే
ఈ మంత్రాన్ని అధిక మాసంలో ప్రతిరోజూ పఠించడం వల్ల నిలిచిపోయిన సొమ్ము తిరిగి వస్తుందని.. మీకు ఆదాయ మార్గాలు మెరుగుపడటమే కాక.. సంపదలో స్థిరత్వం వస్తుందంటున్నారు.
వివాహం, వైవాహిక సమస్యల కోసం
వివాహం ఆలస్యమవుతున్న వారు, లేదంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ అధిక మాసంలో ‘అనిరుద్ధ మంత్రాన్ని’ పఠిస్తే చాలా ప్రయోజనం అంటున్నారు.
- ఓం అః అనిరుద్ధాయ నమః
లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కోసం
శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందాలనుకునే వారు ఈ అధిక మాసంలో ఈ మంత్రాన్ని జపించాలి.
- ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
సంపద కోసం
సంపద, విజయం, విఘ్నాలు తొలగిపోవడానికి ఈ అధిక మాసంలో లక్ష్మీ వినాయక మంత్రం జపిస్తే మంచిది అంటున్నారు.
- దంతాభయే చక్రధరో దధానం,
- కరాగ్ర స్వర్ణఘటం త్రినేత్రమ్
- ధృతాబ్జయా లింగితమబ్ధిపుత్రయా,
- లక్ష్మీ గణేశం కనకాభమీడే
విష్ణు పంచరూప మంత్రాలు
జీవితంలోని అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొంది, సమతుల్యత సాధించడానికి విష్ణువు ఐదు రూపాలకు సంబంధించిన ఈ మంత్రాలు పఠించాలి:
- ఓం నమో వాసుదేవాయ నమః
- ఓం నమో సంకర్షణాయ నమః
- ఓం నమో ప్రద్యుమ్నాయ నమః
- ఓం నమో అనిరుద్ధాయ నమః
- ఓం నమో నారాయణాయ నమః
ఈ ఐదు మంత్రాలు జీవితంలోని వివిధ దశల్లో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి శుభ ఫలితాలను ఇస్తాయి.
సులభమైన మార్గం
ఒకవేళ పైన చెప్పిన మంత్రాలను పఠింపలేకపోతే, “ఓం నమో నారాయణ” లేదా “శ్రీమన్ నారాయణ నారాయణ హరి హరి” అని నిత్యం స్మరించుకున్నా చాలు అంటున్నారు పండితులు.
అధిక మాసం-నియమాలు
- ఈ మాసంలో ప్రతిరోజూ విష్ణువును పూజించాలి.
- సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
- శక్తి మేరకు పేదలకు దానధర్మాలు చేయాలి.
- ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.
ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మంత్ర జపం చేయాలి.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడం లేదు.
