Adhika Masam 2026 these four things are in your house causes poverty remove them immediately
Adhika Masam 2026 : సనాతన సంప్రదాయంలో అధిక మాసానికి ఎంతో… కాలగణన ప్రకారం ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి ఈ అధిక మాసం వస్తుంది. దీన్ని “పురుషోత్తమ మాసం” అని కూడా పిలుస్తారు. ఈ అధిక మాసాన్ని పరమ పవిత్రంగా భావించి.. ఎంతో భక్తిశ్రద్ధలతో మహా విష్ణువుని ఆరాధిస్తారు. కారణం ఈ మాసానికి సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు అధిపతి. కొన్ని ప్రాంతీయ ఆచారాల ప్రకారం దీనిని “మల మాసం” అని కూడా అంటుంటారు. ఈ ఏడాదిలో మే 17 నుంచి మొదలైన అధిక మాసం జూన్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది.
అయితే ఈ అధిక మాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలనూ నిర్వహించరు. కానీ ఈ అధిక మాసంలో లక్ష్మీనారాయణులు లేదా విష్ణుమూర్తి ఆరాధన చేయడం, దానధర్మాలు, జపాలు, ప్రత్యేక పూజలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎంతో అనుకూలమైన సమయం అని పెద్దలు చెబుతుంటారు. అలానే వాస్తు శాస్త్రం ప్రకారం అధిక మాసంలో ఇంట్లో కొన్ని వస్తువులను అస్సలు ఉంచుకోకూడదు. వాటిని తొలగించకపోతే మీ ఇంట దరిద్రం తాండవిస్తుందని అంటున్నారు పండితులు. ఇంతకు ఈ అధిక మాసంలో ఇంట్లో ఉండకూడని ఆ నాలుగు వస్తువులు ఏవంటే..
వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం కూడా అధిక మాసంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఇంట్లోకి సానుకూల శక్తి (పాజిటివ్ ఎనర్జీ) వచ్చేలా చూసుకోవడం ఎంతో అవసరం. ఈ పురుషోత్తమ మాసంలో ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులు ప్రతికూల ప్రభావాన్ని (నెగటివ్ ఎనర్జీని) కలిగిస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కింద పేర్కొన్న నాలుగు వస్తువులను వెంటనే ఇళ్ల నుండి తీసివేయడం మంచిదని సూచిస్తున్నారు.
అధిక మాసంలో ఇళ్ల నుండి తొలగించాల్సిన ఆ 4 వస్తువులు:
వాస్తు నియమాల ప్రకారం చేతులు విరిగిపోయిన దేవతా విగ్రహాలను పూజా గదిలో కానీ, ఇంట్లో కానీ ఉంచకూడదు. వీటిని ఇంట్లో పెట్టుకుంటే.. అవి మీ నివాసంలో ప్రశాంతతను దెబ్బతీసి, ప్రతికూలతను పెంచుతాయి. కనుక ఈ అధిక మాసం వేళ మీ ఇంట్లో విరిగిపోయిన, భిన్నమైన దేవుడి విగ్రహాలు ఉంటే వాటిని సముచిత గౌరవంతో మీ ఇంటి నుంచి తీసుకెళ్లి.. ప్రవహించే నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయడం ఉత్తమం అంటున్నారు పండితులు.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి ఆవరణలో ఎండిన లేదా వాడిపోయిన మొక్కలు ఉంటే ఆ ఇంట్లో నిరుత్సాహం, నిరాశ తాండవిస్తాయని చెబుతుంది. ఇవి ఇంట్లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యుల మానసిక ఉల్లాసాన్ని దెబ్బతీస్తాయని పండితులు చెబుతున్నారు. కనుక ఈ అధిక మాసంలో మీ ఇంటి ఆవరణలో ఇలా ఎండిపోయిన, వాడిపోయిన మొక్కలను తీసేసి, వాటి స్థానంలో చక్కటి పచ్చని కొత్త మొక్కలను నాటాలంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు.
బీటలు వారిన అద్దాలు, పగిలిపోయిన గాజు పాత్రలు లేదంటే వస్తువులు ఇంట్లో ఉంటే అరిష్టమని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇలా పగిలిన గాజు వస్తువులను ఇంట్లోనే పెట్టుకుంటే.. అవి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలను, ఉద్రిక్తతలను పెంచడమే కాకుండా ఆర్థిక సమస్యలను కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు. కనుక ఈ పవిత్రమైన అధికమాసంలో మీ ఇంట్లో ఇలాంటి పగిలిన గాజు వస్తువులు ఉంటే వెంటనే వాటిని పడేయడం మంచిది అంటున్నారు.
గడియారం అనేది నిరంతరం సాగే కాల ప్రవాహానికి, మనుషుల ప్రగతికి నిదర్శనం. అందుకే ఇంట్లో పాడైపోయిన, ఆగిపోయిన గడియారాలు ఉండకూడదు అంటారు. ఇవి మన జీవితంలో అభివృద్ధి నిలిచిపోవడాన్ని సూచిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. అలానే ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే.. ఆ కుటుంబ సభ్యుల ఎదుగుదలకు అడ్డంకులు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు కనుక ఈ అధిక మాసంలో ఈ ఇంట్లో పనిచేయని గోడ గడియారాలు, చేతి గడియారాలను వెంటనే బాగు చేయించుకోవాలి.. లేదంటే పడేయ్యాలని సూచిస్తున్నారు.