Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ.. ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే.. ఇక మీ ఇంట్లో కనకవర్షమే..!

Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ నాడు ఏ సమయంలో బంగారం కొనాలంటే..

akshaya tritiya 2026 the 92 minute golden period for best time to buy gold for prosperity

Akshaya Tritiya 2026 :హిందూ పురాణాల్లో అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు కొత్త పనులు ప్రారంభిస్తే ఇక వెనుతిరిగి చూసే అవసరం లేదని నమ్ముతారు. అలాగే ఈ ఏడాది తృతీయ నాడు పంచాంగంతో పనిలేకుండా శుభకార్యాలు చేసుకునే ‘ముహూర్తం’తో పాటు, ఐదు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇక చాలా మంది అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తారు. వాస్తవానికి కొంతమంది పండితులు, ప్రవచనకర్తలు బంగారం కొనవద్దు.. పసిడిని కొంటే పాపాన్ని కొన్నట్లే అంటున్నారు. కానీ ఏళ్లుగా నమ్ముతూ వస్తున్న జనాలు మాత్రం ఆ అలవాటును మార్చుకోలేకపోతున్నారు. అందుకే తప్పకుండా బంగారం కొంటున్నారు. మరి మీరు కూడా అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలని భావిస్తున్నారా మరి ఎప్పుడు కొనాలి.. అక్షయ తృతీయ తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. వంటి విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఈ ఏడాది తృతీయ తిథి రెండు రోజులు ఉండటంతో సామాన్యుల్లో కొంత గందరగోళం నెలకొంది. అయితే శాస్త్రోక్తంగా:

  • తిథి ప్రారంభం: ఏప్రిల్ 19, ఆదివారం ఉదయం 10:49 గంటలకు.

  • తిథి ముగింపు: ఏప్రిల్ 20, సోమవారం ఉదయం 07:27 గంటలకు.

సూర్యోదయ తిథి, ప్రధాన ముహూర్తాలన్నీ ఆదివారం (ఏప్రిల్ 19) నాడే ఎక్కువగా ఉన్నందున, ఆ రోజే పండుగను జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.

పూజా ముహూర్తం

ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీనారాయణులను, కుబేరుడిని పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయం కేవలం 1 గంట 32 నిమిషాలు (92 నిమిషాలు) మాత్రమే ఉంది.

  • పూజా సమయం: ఏప్రిల్ 19న ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:20 వరకు.

ఈ పవిత్ర సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ లేదా కనకధారా స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.

బంగారం కొనడానికి శుభ ఘడియలు

బంగారం కొనుగోలుకు ఈ ఏడాది ఏకంగా 19 గంటల సుదీర్ఘ సమయం అందుబాటులో ఉంది. అయితే అత్యంత ఉత్తమమైన సమయం మాత్రం పైన పేర్కొన్న 92 నిమిషాలే. అయితే మీ వీలును బట్టి ఈ కింది సమయాల్లో పసిడిని ఇంటికి తెచ్చుకోవచ్చు:

  • ఉదయం అత్యంత ఉత్తమం (చల్, లాభ్, అమృత్): 10:49 AM నుండి 12:20 PM వరకు

  • మధ్యాహ్నం శుభ ఘడియలు (శుభ్): 01:58 PM నుండి 03:35 PM వరకు

  • సాయంత్రం ముహూర్తం: 06:49 PM నుండి 10:57 PM వరకు

  • తెల్లవారుజామున (ఏప్రిల్ 20, సోమవారం): 04:28 AM నుండి 05:51 AM వరకు

అరుదైన రాజయోగాలు – అపారమైన లాభాలు

ఈ సంవత్సరం అక్షయ తృతీయ నాడు.. పంచ మహాయోగాలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు ఏప్రిల్ 20న రవి యోగం కూడా తోడవుతోంది. కనుక ఈ సమయంలో బంగారం, వెండి లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టే పెట్టుబడులు.. దీర్ఘకాలంలో అద్భుతమైన లాభాలను ఇస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.