Hanuman Jayanti 2026 : చైత్ర పౌర్ణమి+హనుమాన్ జయంతి.. ఈ పని చేస్తే..
Hanuman Jayanti 2026 : ఏప్రిల్ 2న చైత్ర పౌర్ణమి, హనుమాన్ జయంతి కలిసి వస్తున్నాయి. మరి ఆ రోజు కొన్ని పనులు చేస్తే విశేష ఫలితం దక్కుతుంది అంటున్నారు.
- Dharani Pilli
- Updated on- March 31, 2026 / 05:41 PM IST
chitra pournami hanuman jayanti 2026 on april 2 significance and rituals
Hanuman Jayanti 2026 : హిందువులు కార్తీక పౌర్ణమిని ఎంత పవిత్రంగా భావిస్తారో.. చైత్ర పౌర్ణమిని కూడా అంతే విశిష్టమైనదిగా గుర్తిస్తారు. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమిని ‘మహా చైత్రి’ అని కూడా పిలుస్తారు. పైగా చైత్ర పౌర్ణమికి ఒక విశిష్టత ఉంది. అదే రోజున హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటారు. తెలుగు సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత వచ్చే తొలి పౌర్ణమి ఇది. మరి ఇంత పవిత్రమైన చైత్ర పౌర్ణమి నాడు.. కొన్ని పనులు, పరిహారాలు చేస్తే.. విశేషమైన ప్రయోజనం లభిస్తుందని పండితులు అంటున్నారు. మరి చైత్ర పౌర్ణమి నాడు ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితమో ఇక్కడ చదవండి..
సముద్ర స్నానం:
చైత్ర పౌర్ణమి నాడు.. సముద్ర స్నానం ఆచరిస్తే.. గత జన్మ పాపాలు, జీవితంలో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి.. మానసిక ప్రశాంతత లభిస్తుందంటున్నారు. ఈ సముద్ర స్నాన ఆచారం వెనుక బలరాముడు తన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్న పురాణ గాథ ఉంది.
దానాలు:
చైత్ర పౌర్ణమి నాడు.. పేదవారికి బట్టలు, అన్నం, డబ్బు దానం చేస్తే.. గ్రహదోషాలు తొలగిపోతాయంటున్నారు పండితులు. ముఖ్యంగా రంగు రంగుల బట్టలు దానం చేస్తే నవగ్రహాల ఆశీస్సులు లభిస్తాయని చెబుతున్నారు.
సత్యనారాయణ స్వామి వ్రతం:
చైత్ర పౌర్ణమి నాడు.. సముద్ర స్నానం ఆచరించిన తర్వాత.. ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం లేదా పూజ చేసుకోవడం చాలా మంచిదంటున్నారు.
వివాహ సమస్యలున్న వారు:
వివాహం ఆలస్యమవుతున్న వారు, తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న వారు.. చైత్ర పౌర్ణమి నాడు శివపార్వతుల కళ్యాణం చేయించినా లేదా దర్శించుకున్నా మంచి ఫలితాలు ఉంటాయని పండితులు అంటున్నారు.
మంత్ర జపం:
చైత్ర పౌర్ణమి రాత్రి వెన్నెల్లో కూర్చుని లలితా సహస్రనామ స్తోత్రం పఠించి.. అమ్మవారికి పాల పాయసం నైవేద్యంగా సమర్పిస్తే ఆ సంవత్సరం అంతా శుభం జరుగుతుందని చెబుతున్నారు.
హనుమాన్ జయంతి, విజయోత్సవం:
చైత్ర పౌర్ణమి నాడే.. రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముడు.. హనుమంతుడి సాయానికి కృతజ్ఞతగా పెద్ద ఎత్తున విజయోత్సవం జరిపిన రోజుగా పురాణాలు చెబుతున్నాయి.
- పూజ: హనుమంతుడిని దర్శించుకుని ప్రదక్షిణలు చేయాలి.
- మంత్రం: “శ్రీ రామదూతాయ హనుమతే నమః” అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు పఠించడం వల్ల రక్షణ మరియు విజయం లభిస్తాయి.
ముఖ్యమైన మంత్రం:
సత్యనారాయణ స్వామి పూజ సమయంలో ఈ చిన్న మంత్రాన్ని పఠించవచ్చంటున్నారు పండితులు.
“సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం | లీలాయ వితతం విశ్వం యోనస్మై నమో నమః”
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv ధృవీకరించడం లేదు
