Hanuman Jayanti 2026 : హనుమాన్ జయంతి.. పూజకు ఏమేం కావాలి.. పీఠాన్ని ఎన్ని రోజులకు కదిలించాలంటే..!
Hanuman Jayanti 2026 : హనుమాన్ జయంతి పూజ చేసుకోవాలంటే కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి.. పీఠం నియమాలు వంటి వివరాలు..
- Dharani Pilli
- Updated on- May 10, 2026 / 09:12 PM IST
Hanuman Jayanti 2026 Puja Materials and Ritual Guidelines
Hanuman Jayanti 2026 : మే 12, మంగళవారం హనుమాన్ జయంతి పర్వదినం. ఈ పూజ చేసుకోవాలని భావించే వారు.. తొలిసారి ఇప్పుడే ఈ పండుగ చేసుకోవాలనుకుంటున్నవారి కోసమే ఈ వార్త. హనుమాన్ జయంతి పండుగకు కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి.. పూజకు కావాల్సిన వస్తువులు, చిత్రపటం లేదా విగ్రహం ఎలాంటిది తీసుకోవాలి.. పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలా.. ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే తిరిగి దాన్ని ఎన్ని రోజులకు కదిలించాలి వంటి వివరాలు ఇక్కడ మీకోసమే..
చిత్రపటం లేదా విగ్రహం:
హనుమాన్ జయంతి పండుగ చేసుకోవాలనుకునే వారు.. పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం, విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఒకవేళ అవి లేకపోతే, హనుమంతుడు ఉండే శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటాన్ని పూజకు ఉపయోగించుకోవచ్చు అంటున్నారు.
తమలపాకులు:
హనుమంతుడికి ఇష్టమైన తమలపాకులను మాలగా గుచ్చడానికి లేదా అష్టోత్తర పూజ కోసం (వీలైతే 108 ఆకులు) సిద్ధం చేసుకోవాలి. అలానే తులసి దళాలు, వివిధ రకాల పూలు సిద్ధం చేసుకోవాలి.
దీపారాధన సామాగ్రి:
- శని బాధల విముక్తి కోసం నవధాన్య దీపం పెట్టడానికి గాను నవధాన్యాలు (తమలపాకుపై పోసి దాని మీద దీపం ఉంచడానికి).
- మట్టి ప్రమిద లేదా కుందు.
- సింధూరం (వత్తులకు మరియు అక్షింతలకు కలపడానికి).
- ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె.
- వత్తులు (సింధూరం కలిపి సిద్ధం చేసుకున్న ఐదు వత్తులు).
పూజా ద్రవ్యాలు:
బియ్యంలో ఆవునెయ్యి మరియు సింధూరం కలిపి తయారు చేసుకున్న సింధూర అక్షింతలు.
నైవేద్యం:
- పానకం, వడపప్పు, చలిమిడి, అప్పాలు, వడలు.
- పండ్లు: అరటి పండ్లు మరియు ఇతర ఫలాలు.
దాన వస్తువులు:
హనుమాన్ జయంతి నాడు కొన్ని దానాలు చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కనుక హనుమాన్ జయంతి నాడు గొడుగు, చెప్పులు, వస్త్రాలు, పండ్లు, పుస్తకాలు, మామిడి పండ్లు, మజ్జిగ, నీటి కుండ వంటివి దానం చేయవచ్చు.
పీఠం-నియమాలు:
హనుమాన్ జయంతి పూజ కోసం మీరు ప్రత్యేకంగా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే దానిని కదిలించడానికి ప్రత్యేక నియమాలు పాటించాలి.
- కదిలించవలసిన సమయం: మే 12 మంగళవారం హనుమాన్ జయంతి. కనుక మరుసటి రోజు అంటే బుధవారం నాడు, స్వామి వారికి మరొకసారి పూజ నిర్వహించిన తర్వాతే పూజా పీఠాన్ని కదపాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
- కదిలించకూడని రోజు: హనుమజ్జయంతి రోజైన మే 12వ తేదీ, మంగళవారం నాడు పూజా పీఠాన్ని అస్సలు కదిలించకూడదు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. 10tv దీన్ని నిర్థారించం లేదు.
