Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ నాడు వాహనం కొనుగోలు చేయవచ్చా.. ఏ రాశి వారికి ఏ రంగు కలిసి వస్తుందంటే..!

Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ నాడు కొత్త వాహనాలు కొనవచ్చా..

is good to purchase a vehicle on Akshaya Tritiya Which colors are lucky for each zodiac sign

Akshaya Tritiya 2026 : హిందూ పురాణాల్లో అక్షయ తృతీయకు చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. అక్షయ అంటేనే నశించనిది అని అర్థం. అందుకే చాలా మంది అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం, కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, వ్యాపారాలు ప్రారంభించడం వంటివి చేస్తుంటారు. ఎక్కువ మంది బంగారం, వెండి కొంటే కలిసి వస్తుందని నమ్ముతారు. కానీ కొందరు మాత్రం వాహనాలు కొనడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. మరి అక్షయ తృతీయ నాడు వాహనాలు కొనుగోలు చేయడం మంచిదేనా.. కొంటే ఏ రాశి వారు ఏ రంగు వాహనాలు కొనాలి అనే దానిపై పండితులు కీలక సూచనలు చేస్తున్నారు.

అక్షయ తృతీయ రోజు వాహనాలు కొనుగోలు చేస్తే చాలా మంచిది అంటున్నారు. అయితే ఈరోజు కొన్ని రకాల రంగులు కలిగిన వాహనాలు కొనుగోలు చేస్తే మరింత అదృష్టం కలిసి వస్తుందంటున్నారు. కాగా, ఇంతకీ అక్షయ తృతీయ నాడు ఏ రాశి వారు ఏ రంగు వాహనాలు కొంటే మంచిది అంటే..

  • మేష రాశి: ఎరుపు, మెరూన్
  • వృషభ రాశి: తెలుపు
  • మిథున రాశి: ఆకుపచ్చ
  • కర్కాటక రాశి: తెలుపు లేదా క్రీమ్
  • సింహ రాశి: చాక్లెట్, మెరూన్
  • కన్యా రాశి: బూడిద రంగు, ఆకుపచ్చ
  • తుల రాశి: తెలుపు, సిల్వర్
  • వృశ్చిక రాశి: ముదురు ఎరుపు రంగు
  • ధనస్సు రాశి: క్రీమ్, పసుపు
  • మకర రాశి: నీలం, గోధుమ
  • కుంభ రాశి: నీలం, నలుపు
  • మీన రాశి: పసుపు, క్రీమ్, నారింజ రంగులో ఉన్న వాహనాలు కొనుగోలు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది.

వైశాఖ మాసం శుక్లపక్షం మూడవ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 19, ఆదివారం ఉదయం 10:49 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 20, సోమవారం ఉదయం 07:27 గంటలకు ముగుస్తుంది. అందువల్ల ఏప్రిల్ 19ననే అక్షయ తృతీయ పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అక్షయ తృతీయ నాడు జలదానం చేస్తే చాలా మంచిది అంటున్నారు.