Pooja Room Vastu Alert : అలర్ట్.. పూజ గదిలో ఈ వస్తువు ఉంటే దరిద్రం మీ వెంటే.. ఇప్పుడే తీసేయండి..!

Pooja Room Vastu Alert : వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఒక వస్తువును అస్సలు ఉంచకూడదంటున్నారు పండితులు. ఆ వివరాలు..

pooja room vastu alert keeping match box in it can bring bad luck

Pooja Room Vastu Alert : హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంట్లోని పూజ గదికి దేవాలయానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఇస్తారు. దీనిని చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. పూజ గదిలోకి వెళ్లడానికి కొన్ని ప్రత్యేకమైన, కఠిన నియమాలను కూడా పాటిస్తారు. ఇంట్లోని పూజా గది కేవలం భక్తి భావాన్ని మాత్రమే కాక ఆధ్యాత్మిక శక్తికి మూల కేంద్రమని పండితులు చెబుతున్నారు. అందుకే పూజ గది పవిత్రతను కాపాడటానికి చాలా మంది వాస్తు నియమాలు పాటిస్తారు. ఈ క్రమంలో పూజ గది విషయంలో నూటికి 99 మంది ఒక తప్పు చేస్తున్నారట. అదేంటంటే.. పూజ గదిలో అగ్గిపెట్టెను ఉంచడం.

సాధారణంగా దీపం వెలిగించడానికి అగ్గిపెట్టెను నేరుగా వాడరాదు అంటారు. ముందుగా అగ్గిపుల్లతో అగరబత్తీ వెలిగించి.. ఆ తర్వాత దానితో దీపం వెలిగిస్తారు. అయితే అగరబత్తులు వెలిగించడానికి అగ్గిపెట్టె అవసరమే అయినా.. దానిని మాత్రం పూజా గదిలోనే ఉంచడం మంచిది కాదంటున్నారు. వాస్తు ప్రకారం.. మండే స్వభావం గల వస్తువులు పూజా గది వంటి పవిత్ర ప్రదేశంలో ఉండటం వల్ల ‘వాస్తు దోషం’ ఏర్పడుతుందని నమ్మకం. అగ్గిపెట్టెను పూజా మందిరంలో పెడితే.. ఇది ఇంట్లో సానుకూల శక్తిని తగ్గించి.. పూజ చేయడం ద్వారా కలిగే ఆధ్యాత్మిక లాభాలను కూడా ప్రభావితం చేస్తుందని పండితులు అంటున్నారు.

దీనికి తోడు.. అగ్గిపెట్టె అగ్ని తత్వం కాగా.. దేవాలయం శాంతి, పవిత్రతలకు నిలయం. అలాంటి ఈ రెండు విరుద్ధ స్వభావాలున్నవి ఒకే చోట ఉంటే… ఆధ్యాత్మిక సమతుల్యత దెబ్బతిని.. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, మానసిక ప్రశాంతత లేకపోవడం వంటి ఫలితాలు కలుగుతాయంటున్నారు.

అలాగే నిద్రించే గదిలో కూడా దీపాలు, మండే వస్తువులను ఉంచడం వాస్తు శాస్త్రం ప్రకారం తప్పంటున్నారు పండితులు. ఇలా ఉంచితే.. దంపతుల దాంపత్య జీవితంలో కలహాలకు దారితీయడమే కాక ఇంట్లో ఆందోళన, ప్రతికూల శక్తి పెరిగేందుకు అవకాశం ఉందంటున్నారు.

ఈ విధమైన వాస్తు దోషాలను నివారించడానికి, అగ్గిపెట్టెలను పూజా గది బయట సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం మంచిది. అవసరమైతే మూసివేసిన డ్రాయర్ లేదా అల్మారాలో పెట్టుకోవచ్చు. తప్పనిసరిగా పూజా గదిలో ఉంచాల్సి వస్తే, దానిని శుభ్రమైన వస్త్రంలో చుట్టి ఉంచడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చని పండితులు సూచిస్తున్నారు.

గమనిక : ఇక్కడ సమాచారాన్ని కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధృవీకరించడం లేదు.