Sri Rama Navami 2026 : రేపే శ్రీరామ నవమి.. ఈ తప్పులు చేశారో.. జీవితాంతం కష్టాలు మీవెంటే..!

Sri Rama Navami 2026 : భక్తులకు అలర్ట్.. శ్రీరామనవమి నాడు ఈ పనులు చేస్తే కష్టాలు పట్టి పీడిస్తాయంటున్నారు.

Sri Rama Navami 2026 dos and donts while fasting on this festival

Sri Rama Navami 2026 : దేశమంతా ఘనంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమి. ప్రతి ఊరిలో రాములోరి కల్యాణం జరిపిస్తుంటారు. అయితే చాలా మంది మిగతా పండుగల్లాగే శ్రీరామనవమికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు. కొందరు ఉపవాసం కూడా ఉంటారు. మరి ఇలా ఉపవాసం ఉన్న వారు తప్పకుండా కొన్ని నియమ, నిబంధనలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అవేంటంటే..

  • శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉన్నవారు ఉల్లిపాయ, వెల్లుల్లి అసలు తినకూడదు.
  • ఉపవాసం లేని వారు కూడా వీటిని తినకూడదు అని చెబుతున్నారు పండితులు.
  • శ్రీరామనవమి నాడు పాటించాల్సిన మరో ముఖ్యమైన నియమం.. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం చేయకూడదంట.
  • ఇది మహాపాపంతో సమానం అంటున్నారు పండితులు.
  • మరీ ముఖ్యంగా శ్రీరామనవమి నాడు స్త్రీలు జుట్టు కత్తిరించుకోకూడదని.. అలా చేస్తే.. వారు సీతమ్మలా కష్టాల పాలవుతారని పండితులు హెచ్చరిస్తున్నారు.
  • కొంతమంది శ్రీరామనవమి రోజు మాంసాహారం తీసుకుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.
  • శ్రీరామనవమి నాడు మాంసాహారం తీసుకుంటే.. అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారంట.
  • అదే విధంగా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించకూడదంట.
  • శ్రీరామనవమి రోజు కుటుంబ సభ్యులు, ఇతరులు.. ఇలా ఎవరితో కూడా గొడవ పెట్టుకోవడం.. వేరే వారిని కించపరిచినట్లు మాట్లాడటం వంటి పనులు అస్సలే చేయకూడదట.
  • దీని వలన మీరు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు పండితులు.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని 10tv ధృవీకరించడం లేదు.