Tuesday Lemon Remedy : నరదృష్టితో బాధపడుతున్నారా.. మంగళవారం నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే.. దిష్టి పటాపంచలు..!

Tuesday Lemon Remedy : నరదృష్టితో బాధపడుతున్న వారు మంగళవారం నాడు నిమ్మకాయతో ఇలా చేస్తే.. ఇక తిరుగుండదు.

Suffering from negative energy or evil eye Do this simple remedy with lemon on Tuesday to finish it completely

Tuesday Lemon Remedy : దిష్టి/దృష్టి.. అంటే చాలా మంది నమ్మరు కానీ నెగిటివ్ ఎనర్జీ అంటే చదువుకున్న వారు కూడా నమ్ముతారు. నరదృష్టి, నరఘోష.. కాస్త బాగుపడుతున్నామంటే ఇతరుల ఏడుపు.. అన్నీ కలిసి మన జీవితంలో మనశాంతిని దూరం చేస్తాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో గొడవలు అవ్వడం, అనారోగ్య సమస్యలు రావడం వంటివి జరుగుతుంటాయి. చేతిలో ధనం నిలవదు. మరి మన ఇంట్లో నరదృష్టి ప్రభావం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే. ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారంతో ఇంటికి, ఒంటికి పట్టిన నరఘోష పటాపంచలవుతుంది. దీని నుంచి బయటపడటానికి రూపాయి ఖర్చు లేని ఒక చిన్న పరిహారం ఉంది.

ఇందుకు కావాల్సింది కేవలం రెండు నిమ్మకాయలు మాత్రమే. మంగళవారం నాడు ఈ పరిహారం పాటిస్తే.. మీ కుటుంబం మీద, మీ మీద ఉన్న నరఘోషను తొలగించుకోవచ్చు. పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు చాలా శక్తి ఉంది. చాలా వరకు పరిహారాలకు నిమ్మకాయలనే ఉపయోగిస్తారు. ఇప్పుడు నరదృష్టిని తొలగించడానికి కూడా నిమ్మకాయలనే తీసుకోవాలి.

పరిహారం ఎలా చేయాలంటే..

  • మంగళవారం నాడు రెండు నిమ్మకాయలు తీసుకోండి.
  • రెండు పసుపు లేదా ఆకుపచ్చ నిమ్మకాయలు తీసుకోవచ్చు. కాకపోతే వాటి మీద మచ్చలు వంటివి లేకుండా శుభ్రంగా ఉండాలి.
  • నిమ్మకాయలతో పాటు కుంకుమ, కాటుక కూడా తీసుకోవాలి.
  • ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో కుంకుమ వేసి, కొద్దిగా నీరు చల్లి తడుపుకోవాలి.
  • ఒక నిమ్మకాయను తీసుకుని దానికి పూర్తిగా తడి కుంకుమ పూయాలి.
  • మరో నిమ్మకాయకు మొత్తం గ్యాప్ లేకుండా కాటుక రాయాలి.
  • ఈ రెండు నిమ్మకాయలను కుడి చేతిలో పట్టుకుని ఇల్లంతా అన్ని గదుల్లోనూ తిరగాలి.
  • ఇలా తిరిగేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే.. ఈ పరిహారం పనిచేయదు.
  • ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలను తీసుకుని ఎవరూ తొక్కని చోట, ఎక్కడైనా చెట్టు దగ్గర పడేయాలి.

ఇలా కొన్ని వారాల పాటు చేస్తే మీ ఇంటికి, ఒంటికి పట్టిన నరఘోష పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో సానుకూల శక్తి (పాజిటివ్ ఎనర్జీ) పెరుగుతుంది. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.