Ugadi 2026 Dos and Donts : ఉగాది పండగ నాడు పొరపాటున కూడా వీటిని కొనొద్దు.. దానం ఇవ్వొద్దు..!

Ugadi 2026 Dos and Donts : ఉగాది పండగ నాడు చేయాల్సిన, చేయకూడని.. కొనాల్సిన, కొనకూడని వస్తువులు గురించి తెలుసుకుందాం .

ugadi 2026 dos and donts also buy and do not buy things details

Ugadi 2026 Dos and Donts : మార్చి 19, గురువారం నాడు ఉగాది పండగ. తెలుగు సంవత్సరాది ప్రారంభం ఈ రోజు నుంచే. ఉగాది పండగ నాడు కచ్చితంగా ఉగాది పచ్చడి తింటారు. పంచాంగ శ్రవణం చేస్తారు. అయితే ఉగాది నాడు కొన్ని వస్తువులను కొంటే అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఉగాది పండగ నాడు కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనవద్దంటున్నారు. అలాగే కొన్నింటిని దానం చేయవద్దని సూచిస్తున్నారు. అలా చేస్తే సంవత్సరం అంతా కష్టాలు ఎదురవుతాయని అంటున్నారు.

ఉగాది నాడు కొనాల్సిన వస్తువులు

  • గళ్ళుప్పు,
  • పసుపు,
  • దక్షిణావృత శంఖం,
  • గోమతి చక్రాలు,
  • లక్ష్మీ గవ్వలు,
  • పూజా వస్తువులు.
  • కొత్త చీపురు కట్టను కొనుగోలు చేయవచ్చు.

అలాగే వీటిని ఉగాది నాడు ఉదయం 9:40 నుండి 10:00 గంటల మధ్యలో కొనుగోలు చేయాలని చెబుతున్నారు.

కొనకూడని వస్తువులు

  • పింగాణి,
  • గాజు పాత్రలు,
  • సీసం,
  • ఇనుప వస్తువులు (కత్తెరలు వంటివి) కొనకూడదు.
  • కొత్త వాహనాలు కూడా ఇనుముతో కూడినవి కాబట్టి ఉగాది రోజున కొనుగోలు చేయకపోవడం మంచిది.
  • నూనె సంబంధిత వస్తువులను ఇతరులకు దానం ఇవ్వకూడదు, ఇంటికి తీసుకురాకూడదు.

ఉగాది నాడు చేయకూడని పనులు

  • ఆలస్యంగా నిద్రలేవడం
  • స్నానం చేయకుండా ఉండటం
  • ఇంటిని శుభ్రం చేయకపోవడం
  • పూజ, ఉగాది పచ్చడి తినకపోవడం
  • ఇతరులతో గొడవపడటం
  • అప్పులు తీసుకోవడం
  • మద్యం, మాంసం, పొగతాగడం వంటి పనులు చేయవద్దని చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీనికి ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ లేదు.