Ugadi 2026 : ఉగాది ముందు రోజు అమావాస్య.. దేవుడి ఫొటోలు, పూజా మందిరం, ఇల్లు.. ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి..?

Ugadi 2026 Puja Rituals : ఉగాది పండగ ముందు అమావాస్య, దానికి ముందు మంగళవారం. మరి ఇంటిని , పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే..

ugadi 2026 when should clean house and god photos pooja mandir

Ugadi 2026: పండగ వస్తుందంటే తప్పక చేసే పని ఇంటిని శుభ్రం చేసుకోవడం. ఈ క్రమంలో మార్చి 19న ఉగాది పండగ రాబోతోంది. అయితే పండగ ముందు అమావాస్య. చాలా మంది అమావాస్య నాడు ఇంటిని శుభ్రం చేసుకోరు. మరీ ముఖ్యంగా దేవుడి పటాలు, పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోవడానికి కొన్ని నియమాలు పాటిస్తారు. మరి ఈ ఉగాది పండగ నేపథ్యంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి.. దేవుడి పటాలను శుభ్రం చేసుకునే పద్ధతి ఏంటి అనే దాని గురించి పండితులు చెబుతున్న వివరాలు ఇక్కడ మీకోసం..

ఉగాది పండగ నేపథ్యంలో ఇంటిని శుభ్రం చేసుకోవాలనుకుంటే.. నేడు మార్చి 16, సోమవారం ఉదయం 9:00 గంటల తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడం (బూజు దులపడం, ఇల్లు కడగడం) చాలా శ్రేయస్కరం. ఈరోజు కుదరలేదు కాబట్టి రేపు చేసుకోవచ్చా.. అంటే.. మంగళవారం ఇంటిని శుభ్రం చేయకూడదు అంటున్నారు. మరి ఎప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవాలంటే..

ఉగాది రోజు ఉదయం 7:00 నుండి 8:00 గంటల మధ్యలో ఇంటిని శుభ్రం చేసుకుని.. పూజా మందిరాన్ని, విగ్రహాలను శుభ్రం చేసుకోవచ్చు. అయితే పూజా మందిరం, దేవుడి పటాలను శుభ్రం చేయాలంటే.. స్నానం చేసి శుభ్రం చేయాలి. ఇంటిని శుభ్రం చేసే నీటిలో గోమూత్రం, గంగాజలం, గళ్ళుప్పు, పసుపు వేసిన నీటితో శుభ్రం చేసుకోవాలంటున్నారు. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అంటున్నారు.

జాజికాయ, జాపత్రి, ఇలాచీ, పచ్చకర్పూరం పొడి, సాంబ్రాణి లేదా గుగ్గిలంతో ధూపం వేస్తే ఇంట్లోని చెడు శక్తి తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైంది. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.