Vaishakha Amavasya 2026 : వైశాఖ అమావాస్య 2026.. అత్యంత శక్తివంతమైంది… ఆ రోజు మర్చిపోయి కూడా ఈ పనులు చేయవద్దు..!
Vaishakha Amavasya 2026 : వైశాఖ అమావాస్య అత్యంత శక్తివంతమైన రోజు. ఆనాడు మర్చిపోయి కూడా కొన్ని పనులు చేయవద్దని సూచిస్తున్నారు.
- Dharani Pilli
- Updated on- April 15, 2026 / 09:16 PM IST
Vaishakha Amavasya 2026 date puja muhurat and dos and don'ts on this auspicious day
Vaishakha Amavasya 2026 : సాధారణంగా ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంది. కానీ హిందూ పురాణాల ప్రకారం కొన్ని అమావాస్యలు చాలా విశిష్టతను కలిగి ఉంటాయి. అలాంటిదే వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య. ఈ వైశాఖ అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు, నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది అని భావిస్తారు. ఈసారి వైశాఖ అమావాస్య ఏప్రిల్ 16న రాత్రి 8:11 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 17న సాయంత్రం 5:21 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం ఆధారంగా లెక్కించే ఉదయ తిథి ప్రకారం, ఏప్రిల్ 17న అమావాస్యను పాటిస్తారు. వైశాఖ అమావాస్య అత్యంత శక్తివంతమైనదిగా నమ్ముతారు. ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని పనులు చేయవద్దు అంటారు. అవేంటంటే..
ఆహారం:
వైశాఖ అమావాస్య నాడు మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలు అసలే తీసుకోకూడదు. అలానే మినుములు లేదా వాటితో చేసిన వంటకాలు తినకూడదు.
దురలవాట్లు:
మద్యం సేవించడం, ధూమపానం లేదా ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలి.
గొడవలు:
ఇంట్లో, బయట ఎవరితోనూ వాదోపవాదాలు, గొడవలకు పోకూడదు. మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండాలి.
శుభ కార్యాలు:
వైశాఖ అమావాస్య అనే కాకుండా.. సాధారణంగా కూడా అమావాస్య నాడు కొత్త పనులు మొదలు పెట్టరు. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరపరు. ఆ రోజు కేవలం జప, తప, దానాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. పెద్ద పెద్ద కొనుగోళ్లు చేయకూడదంటున్నారు పండితులు.
చెట్లు నరకడం:
వైశాఖ అమావాస్య నాడు చెట్లను నరకడం లేదా ఆకులను కోయడం వంటి పనులు అసలే చేయకూడదు అంటున్నారు.
స్త్రీ సాంగత్యానికి దూరం:
వైశాఖ అమావాస్య నాడు బ్రహ్మచర్యం పాటించడం మంచిది.
ఎవరిని కించపరచకూడదు:
ఈ రోజున ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా కష్టపడి పనిచేసే కూలీలను, వృద్ధులను గౌరవించాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధృవీకరించడం లేదు.
