Abhishek Sharma : వరుసగా మూడు డకౌట్లు.. టీమ్‌కు మోటివేషన్ స్పీచ్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. నవ్వుకున్న గంభీర్
భారత జట్టు ప్రాక్టీస్ సమయంలో విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మోటివేషన్ స్పీచ్ ఇచ్చాడు.
Abhishek Sharma Motivational Team speech Despite 3 Ducks
Abhishek Sharma : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌కు అసలైన సవాల్ ఇది. అద్భుత ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా జట్టును సూపర్-8లో భాగంగా ఆదివారం భారత్ ఢీ కొట్టబోతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే రెండు జట్లు కూడా అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించేందుకు ఎవరి వ్యూహాలను వారు పన్నుతున్నారు.
ఇక భారత జట్టు ప్రాక్టీస్ సమయంలో విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మోటివేషన్ స్పీచ్ ఇచ్చాడు. అభిషేక్ చెప్పిన మాటలకు ఆఖరిలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముఖంలో చిరు నవ్వు కనిపించడం విశేషం.
Abhishek Sharma : దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. అభిషేక్ శర్మకు ఐడెన్ మార్క్రమ్ ముప్పు..! ఇప్పుడెలా?
‘ఇది ఛాంపియన్ జట్టుకు సంకేతం. ఒకరి ప్రదర్శనలను మరొకరు ఆస్వాదిస్తూనే ఉందాం. అదే మనం ప్రస్తుతం చేస్తున్న అత్యుత్తమ పని. అన్ని మ్యాచ్‌ల్లో మనం అద్భుతంగా ఆడుతున్నాం. మ్యాచ్‌లను గెలిచేందుకే మనం ఉన్నాం.’ అని అభిషేక్ శర్మ అన్నాడు. తన ప్రసంగాన్ని ఓ స్లోగెన్తో ముగించాడు. అభిషేక్ శర్మ మాటలకు సహచర ఆటగాళ్లతో పాటు టీమ్హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నవ్వుకున్నాడు.
ఈ వీడియోలో అభిషేక్ శర్మ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతడి సహచర ఆటగాళ్లు కూడా మంచి జోష్‌లో కనిపించారు.
ఖాతా తెరవని అభిషేక్ శర్మ..
టీ20 ప్రపంచకప్ 2026లో అభిషేక్ శర్మ ఇప్పటి వరకు పరుగుల ఖాతా తెరవలేదు. అనారోగ్యంతో ఓ మ్యాచ్‌కు అతడు దూరం కాగా.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతడు డకౌట్లు అయ్యాడు. ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా పొట్టి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన అతడు ఇలా విఫలం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికి కూడా అతడికి జట్టు మేనేజ్మెంట్ నుంచి గట్టి మద్దతు ఉంది. ప్రస్తుతం అభిషేక్ శర్మ ఫామ్ పై తమకు ఎలాంటి ఆందోళన లేదని, ఒక్క ఇన్నింగ్స్‌తో అతడు ఫామ్‌లోకి వస్తాడనే ధీమాను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తం చేశాడు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సూపర్ 8 ఫార్మాట్ పై ఐసీసీ ఎందుకు విమర్శలు ఎదుర్కొంటోంది?
Look at Ishan kishan’s face, when Abhishek is giving the pep talk. 😂 pic.twitter.com/zm1tLzUyjZ
— Gangadhar (@gangadhar_11) February 20, 2026
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనైనా అభిషేక్ శర్మ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
