IND vs AFG : భార‌త్‌తో టీ20 సిరీస్‌కు అఫ్గాన్ జ‌ట్టు ఇదే..

భార‌త్ వేదిక‌గా అఫ్గానిస్థాన్ మూడు మ్యాచ్‌ల (IND vs AFG )టీ20 సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

Afghanistan announces squad for T20I series against India

IND vs AFG : భార‌త్ వేదిక‌గా అఫ్గానిస్థాన్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. టీమ్ఇండియాతో సెప్టెంబ‌ర్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. 15 మందితో కూడిన జ‌ట్టును ఎంపిక చేసింది. అంతేకాదండోయ్‌.. ముగ్గురు ఆట‌గాళ్ల‌ను రిజ‌ర్వ్ ప్లేయ‌ర్లుగా తీసుకున్నారు.

ఇబ్రహీం జద్రాన్ నాయ‌క‌త్వంలో అఫ్గాన్ బ‌రిలోకి దిగ‌నుంది. ఇక భుజం గాయం నుంచి కోలుకున్న పేస‌ర్ నవీన్-ఉల్-హక్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. సెప్టెంబ‌ర్ 13, 15, 17 తేదీల్లో జ‌ర‌గ‌నున్న ఈ సిరీస్‌కు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆతిథ్యం ఇవ్వనుంది .

IND vs SL : కొలంబో టెస్టులో ప‌ట్టుబిగిస్తున్న భార‌త్.. ముగిసిన రెండో రోజు ఆట‌..

భారత్‌తో టీ20ఐ సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ జ‌ట్టు ఇదే..

ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీప‌ర్‌), నూర్ రెహమాన్ (వికెట్ కీప‌ర్‌), సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యల్ ఖరోటీ, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌, ఫ‌జ‌ల్ హ‌క్ ఫారూఖీ, అబ్దుల్లా, అహ్మ‌ద్ జాయ్‌, నవీన్-ఉల్-హక్.

రిజ‌ర్వ్ ఆట‌గాళ్లు వీరే..
ఇజాజ్ అహ్మద్‌జాయ్, షాహిదుల్లా కమల్ ఫరీద్ అహ్మద్ మాలిక్‌