Salman Ali Agha : బంగ్లాదేశ్ మ్యాచ్‌లో రనౌట్.. సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ తీవ్ర ఆగ్రహం.. అతడి ఖాతాలో..
సల్మాన్ అలీ అఘా (Salman Ali Agha) ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మండిపడింది.
- Thota Vamshi Kumar
- Published On : March 14, 2026 / 05:38 PM IST
After controversial run out against Bangladesh ICC punishes Salman Ali Agha
- బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో వివాదాస్పద రనౌట్
- హెల్మెట్, బ్యాట్, గ్లౌవ్స్ ను విసిరికొట్టిన సల్మాన్ అలీ అఘా
- ఐసీసీ తీవ్ర ఆగ్రహం
Salman Ali Agha : శుక్రవారం ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా రనౌట్ తీవ్ర దుమారమే రేపుతోంది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దం అని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం కాదని అంటున్నారు.
ఏదీ ఏమైనప్పటికి కూడా సల్మాన్ (Salman Ali Agha) రనౌట్ వీడియో వైరల్ అవుతోంది. అయితే.. రనౌట్ తరువాత సల్మాన్ అలీ అఘా ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మండిపడింది. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
Abrar Ahmed : అబ్రార్ అహ్మద్‌కు ముస్తాఫిజుర్ రెహమాన్ లాంటి పరిస్థితి ఎదురవుతుందా?
సల్మాన్ అలీ అఘా ఔట్ కాగానే తన హెల్మెట్‌ను, బ్యాట్‌ను నేలపై విసిరికొట్టాడు. దీనిపై మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు చేయగా ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘనలో లెవల్ 1 నేరంగా పేర్కొంది. అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, గ్రౌండ్ పరికరాలు, ఫిట్టింగ్‌లను ధ్వంసం చేయడం ఈ నేరం కిందకు వస్తాయి.
Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz
— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026
NZ vs SA : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌ను ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
‘సల్మాన్ మైదానంలో హెల్మెట్, గ్లౌవ్స్, బ్యాట్‌ను విసిరివేశాడు. గతంలో అతడు ఎప్పుడు ఇలా చేయలేదు. అయినప్పటికి కూడా అతడు చేసిన దానికి చర్యలు తీసుకుంటున్నాము. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చుతున్నాము. ఇక లిటన్ దాస్‌తో జరిగిన వాగ్వాదానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోవడం లేదు. అది కేవలం అపార్థంగా జరిగిన ఘటనగా భావిస్తున్నాము.’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
