T20 World Cup 2026 : అబ్బా సాయిరాం.. ఆ ఒక్కటీ జరిగితే పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి టాటా బైబై ఖతం..
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ అవమానకరమైన ఓటమిని చవిచూసింది
- Thota Vamshi Kumar
- Published On : February 16, 2026 / 08:20 AM IST
After lost match to India if this happen Pakistan knocked off T20 World Cup 2026
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ అవమానకరమైన ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ సూపర్-8 కు అర్హత సాధించింది.
కాగా.. టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టుకు ఇదే తొలి ఓటమి. అయితే.. ఈ ఓటమి పాక్ సూపర్ 8 కు అర్హత సాధించే అవకాశాలపై ఒత్తిడి పెంచుతుంది.
టీ20 ప్రపంచకప్ 2026 నుంచి పాక్ నిష్ర్కమిస్తుందా?
గ్రూప్-ఏ నుంచి భారత్ ఇప్పటికే సూపర్ 8 కు అర్హత సాధించింది. మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం అమెరికా, పాకిస్థాన్‌లు పోటీపడుతున్నాయి. నాలుగు మ్యాచ్‌లు ఆడిన అమెరికా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది. మరోవైపు పాక్ మూడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించి నాలుగు పాయింట్లతో నిలిచింది. అటు అమెరికా, ఇటు పాకిస్థాన్‌లు నాలుగు పాయింట్లతో ఉన్నప్పటికి మెరుగైన నెట్‌రన్‌రేటు ఉన్న యూఎస్ఏ (+0.787) ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
భారత్ చేతిలో భారీ తేడాతో ఓడిపోవడంతో పాక్ నెట్‌రన్‌రేటు దారుణంగా పడిపోయింది. భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ నెట్ రన్‌రేటు +0.932 ఉండగా.. ప్రస్తుతం -0.403కి పడిపోయింది. దీంతో పాక్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. గ్రూప్ స్టేజీలో పాక్ తమ చివరి మ్యాచ్‌ను నమీబియాతో బుధవారం ఆడనుంది.
ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిపోతే అప్పుడు ఆ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్ర్కమిస్తుంది. అదే జరిగితే వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే పాక్ నిష్ర్కమించినట్లు అవుతుంది. టీ20 ప్రపంచకప్ 2024లో పాక్ జట్టు యూఎస్ఏ చేతిలో ఓడిపోయి గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లింది.
