CSK vs KKR : కోల్‌క‌తాకు షాక్‌.. అజింక్యా ర‌హానేకు భారీ జ‌రిమానా..

మంగ‌ళ‌వారం చెపాక్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే పై 32 ప‌రుగుల తేడాతో (CSK vs KKR) కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఓడిపోయింది.

Ajinkya Rahane fined Rs 12 lakhs after KKR loss to CSK in IPL 2026 (pic credit@ipl)

  • చెపాక్‌లో చెన్నై చేతిలో ఓడిపోయిన కేకేఆర్‌
  • ఈ మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేసిన కోల్‌క‌తా
  • కెప్టెన్ ర‌హానేకు జ‌రిమానా

CSK vs KKR : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కోల్‌క‌తాకు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో కేకేఆర్ గెలుపు బోణీ కొట్ట‌లేదు. మంగ‌ళ‌వారం చెపాక్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే పై 32 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజ‌న్‌లో కేకేఆర్‌కు ఇది నాలుగో ఓట‌మి. కాగా.. మ‌రో మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది.

ఇదిలాఉంటే.. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్ అజింక్యా ర‌హానేకు ఐపీఎల్ నిర్వాహ‌కులు షాకిచ్చారు. 12 ల‌క్ష‌ల జ‌రిమానాగా విధించారు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో కేకేఆర్ జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేటు (నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్ల కోటాను పూర్తి చేయ‌క‌పోవ‌డం) న‌మోదు చేయ‌డ‌మే అందుకు కార‌ణం.

Also read :  సాకులు చెప్ప‌డం లేదు.. చెమ‌ట ఉంది.. రుతురాజ్ గైక్వాడ్ కీల‌క కామెంట్స్‌..

ఈ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డంతో కెప్టెన్ ర‌హానే ఒక్క‌డికే జ‌రిమానా విధించారు. రెండో సారి ఇదే త‌ప్పిదానికి పాల్ప‌డితే అప్పుడు కెప్టెన్‌కు రూ 24ల‌క్ష‌ల జ‌రిమానాతో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా తుది జ‌ట్టులోని ఆట‌గాళ్లకు మ్యాచ్ ఫీజుల్లో 25 శాతం లేదంటే 6 ల‌క్ష‌లు.. రెండింటిలో ఏదీ త‌క్కువ అయితే అది జ‌రిమానాగా విధిస్తారు.

‘చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026, 22వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేసినందుకు గాను ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానెకు జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని కనీస ఓవర్-రేట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి ఉల్లంఘన ఇది కావడంతో.. రహానెకు 12 లక్షల రూపాయల జరిమానా విధించారు. ‘అని ఐపీఎల్ నిర్వాహ‌కులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. సంజూశాంస‌న్ (48), డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుష్ మాత్రే (38) రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో కార్తిక్ త్యాగి రెండు, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

Also read : జ‌ట్టులో భారీ మార్పులు త‌ప్ప‌దు.. సీఎస్‌కే పై ఓట‌మితో అజింక్యా ర‌హానేకు జ్ఞానోద‌యం..!

అనంత‌రం 193 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో కేకేఆర్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో ర‌మ‌ణ్‌దీప్ సింగ్ (35), రోవ్‌మన్ పావెల్ (31) రాణించారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ మూడు, అన్షుల్ కంబోజ్ రెండు వికెట్లు, ఖలీల్ అహ్మద్, అకీల్ హోసేన్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.