Rohit Sharma : ఆకాశ్ అంబానీ కారులో రోహిత్ శర్మ .. వీడియో వైరల్
ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు నుంచి ముంబై ఇండియన్స్ పేరు వార్తల్లో నిలుస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- April 11, 2024 / 04:08 PM IST
Akash Ambani and Rohit Sharma spotted arriving at Wankhede Stadium together
Akash Ambani – Rohit Sharma : ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు నుంచి ముంబై ఇండియన్స్ పేరు వార్తల్లో నిలుస్తోంది. ఐదు సార్లు జట్టుకు టైటిల్‌ను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి అతడి స్థానంలో హార్థిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. హార్దిక్ నాయకత్వంలో ముంబై జట్టు తడబడుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన ముంబై మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
ఈ క్రమంలో కెప్టెన్సీ మార్పు పై వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. హార్దిక్ స్థానంలో తిరిగి రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించనున్నారు అని అంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అభిమానులు రికార్డ్ చేసిన ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ కారులో రోహిత్ శర్మ ప్రయాణిస్తూ కనిపించాడు. వీరిద్దరు వాంఖడే స్టేడియం వైపు వెలుతున్నట్లుగా కనిపించింది. ఆకాష్ అంబానీ స్వయంగా కారు డ్రైవింగ్ చేయడం విశేషం. ఆకాశ్ కారులో రోహిత్ శర్మ ఎందుకు ప్రయాణించారు అన్న దాని పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కెప్టెన్సీ మార్పు పై చర్చించారని కొందరు, ఏదైన కీలక విషయాలను డిస్కస్ చేస్తున్నారేమో అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
కాగా.. వాంఖడే వేదికగా నేడు గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇరు జట్లకు కీలకం
