Apple iPhone 15
ఐఫోన్ తమ వద్ద ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే, ఐఫోన్ ధరలు చాలా ఖరీదు కావడంతో వాటిని కొనకుండా వెనకడుగు వేస్తుంటారు. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్లు డిస్కౌంట్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌చేంజ్ ఆఫర్లను పూర్తి స్థాయిలో వాడుకుంటే అతి భారీ తగ్గింపుకే ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్‌లో ఐఫోన్ 15 128GB వెర్షన్ ధరను రూ.79,900గా లిస్ట్ చేశారు. అమెజాన్ నుంచి ఈ ఐఫోన్ మోడల్‌పై నేరుగా 23 శాతం తగ్గింపు పొందవచ్చు. దీంతో కేవలం రూ. 61,400కే కొనుగోలు చేయవచ్చు.
Also Read: అమెజాన్‌లో వీటిపై 70 శాతం వరకు డిస్కౌంట్.. భలే అవకాశం కదూ..
మీరు ఈఎంఐలో కొనుక్కోవాలని అనుకుంటే ప్రతి నెల రూ.2,764 చెల్లించాలి. ఐఫోన్ 15.. 128GB వెర్షన్‌కు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిపై, అమెజాన్ రూ.52,200 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది.
మీ పాత ఫోన్ బాగుండి, మీరు పూర్తి ఎక్స్‌చేంజ్ విలువను పొందితే ఈ ఐఫోన్‌ను దాదాపు రూ.9,200కే కొనుగోలు చేయవచ్చు. అంటే 10 వేల రూపాయల కంటే తక్కువ ధరకే ఐఫోన్‌ను కొనొచ్చు. ఐఫోన్ 15 పాత మోడలే. గత ఏడాది ఆపిల్ ఐఫోన్ 16ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
ఐఫోన్ 15 ఫీచర్లు
అల్యూమినియం ఫ్రేమ్, సిరామిక్ షీల్డ్‌తో అందుబాటులో ఉంది. IP68 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్ డిస్‌ప్లేతో ఇది అందుబాటులో ఉంది.
డైనమిక్ ఐలాండ్ తో ఐఫోన్ 15ను తీసుకొచ్చారు. వీడియో నాణ్యత కోసం డాల్బీ విజన్‌కు సపోర్టుతో దీన్ని విడుదల చేశారు. A16 బయోనిక్ చిప్ (4nm టెక్నాలజీ) తో మార్కెట్లో అందుబాటులో ఉంది. సాఫ్ట్‌వేర్ iOS 18.2.1లో నడుస్తుంది.