Sanjay Manjrekar : భారత్, పాక్ మ్యాచ్‌లో మునుపటి మజా లేదు.. మ్యాచ్ జరగకపోయినా నో ప్రాబ్లమ్..
భారత్, పాక్ మ్యాచ్‌ల్లో మునుపటి మజా లేదని అంటున్నాడు టీమ్ఇండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar).
Sanjay Manjrekar feels that an India vs Pakistan clash is not a big deal anymore
Sanjay Manjrekar : టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే.. ఈ మెగాటోర్నీలో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరించాలని తమ జట్టును పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్‌పై అనిశ్చితి ఏర్పడింది.
తాజాగా దీనిపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. అసలు భారత్, పాక్ మ్యాచ్ జరగకపోయినా ఏం పరవాలేదన్నాడు. ఇటీవల కాలంలో మ్యాచ్‌లు అన్ని ఏకపక్షం అవుతున్నాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత పాక్ జట్టు చాలా బలహీనంగా ఉందన్నాడు.
కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నాడు. ఈ క్రమంలోనే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌లో మునపటి మజా లేదన్నాడు. 90వ దశకంలో ఆ జట్టు చాలా బలంగా ఉండేదన్నాడు.
View this post on Instagram
T20 World Cup 2026 : దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఇప్పుడు భారత జట్టు పాక్‌తో ఆడేటప్పటి కంటే.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో ఆడేటప్పుడు ఎక్కవ ఉత్కంఠగా ఉంటుందన్నాడు. పాక్ జట్టుతో భారత్ ఆడుతుంటే ఏదో చిన్న జట్టుతో ఆడుతున్నట్లుగా ఉందన్నాడు.
