Andhra Premier League Schedule: IPL అయిపోయింది.. APL వచ్చేసింది.. ఈ నెల్లోనే.. ఫ్రీగా చూడాలంటే..
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (Andhra Premier League Schedule) మూడో సీజన్ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
- V Santhosh Kumar
- Published on- June 7, 2026 / 05:39 PM IST
Andhra premier league schedule free entry for students
- ఈ నెల 9 నుండి ఏపీఎల్.
- విద్యార్థులకు స్టేడియంలో ఉచిత ప్రవేశం.
- మంగళగిరిలో 30న ఫైనల్ మ్యాచ్.
Andhra Premier League Schedule: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (Andhra Premier League Schedule) 5 సీజన్ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు విజయవాడలో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో ఆంధ్రా క్రికెట్ సంఘం (ACA) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు టోర్నీ వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మొత్తం 7 జట్లు లీగ్ ప్రాతిపదికన తలపడనున్నాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ను విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు.
మూడు వేదికల్లో మ్యాచ్‌లు.. 30న మంగళగిరిలో ఫైనల్స్:
క్రికెట్ క్రేజ్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ఈసారి మూడు వేర్వేరు నగరాల్లో మ్యాచ్‌లను ప్లాన్ చేశారు. టోర్నీని మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ మ్యాచ్‌లకు విశాఖపట్నం వేదిక కానుండగా, రెండో దశ మ్యాచ్‌లు కడపలో జరగనున్నాయి. ఇక అత్యంత ఉత్కంఠభరితంగా సాగే చివరి దశ మ్యాచ్‌లతో పాటు, ఈ నెల 30న జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌కు మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
విద్యార్థులకు ఉచిత ప్రవేశం.. ప్రచారం కోసం ఫ్లాష్ మాబ్‌లు:
ఈ లీగ్‌ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు, పోటీల షెడ్యూల్‌ను వివరించేందుకు విశాఖ, కడప, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫ్లాష్ మాబ్‌లు (Flash Mobs) నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా, యువతను, విద్యార్థులను క్రికెట్ వైపు ప్రోత్సహించేందుకు సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఐడీ కార్డులు చూపించే విద్యార్థులకు స్టేడియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నారు. స్థానిక ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ ఏపీఎల్ ఒక అద్భుతమైన వేదికగా నిలవనుంది.
