HCA Elections 2023 : హెచ్‌సీఏ ఎన్నికల బరిలో అనిల్ కుమార్ ప్యానెల్.. హెచ్‌సీఏను ప్రక్షాళన చేస్తాం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది.
- Thota Vamshi Kumar
- Updated on- October 17, 2023 / 02:39 PM IST
HCA Elections 2023
HCA Elections : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఒక్కో పోస్ట్ కోసం నలుగురు బరిలో నిలిచారు. శుక్రవారం (అక్టోబర్ 20)న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ తో పాటు వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ సభ్యులను ఎన్నుకోనున్నారు. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.
గుడ్ గవర్నెన్స్ అనే పేరుతో తమ ప్యానెల్ హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అనిల్ కుమార్ తెలిపారు. తాను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్‌గా దళ్ జీత్ సింగ్, సెక్రటరీ గా ఆగం రావు, ట్రెజరర్ గా మహేంద్ర, జాయింట్ సెక్రటరీగా బసవ రాజు, కౌన్సిలర్ గా వినోద్ ఇంగ్లే పోటీకి దిగుతున్నట్లు వివరించారు. మంచి పరిపాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. అవినీతితో కూరుకుపోయిన హెచ్‌సీఏను ప్రక్షాళన చేస్తామన్నారు.
HCA Elections: అర్శనపల్లి జగన్మోహన్ రావుకి పోటీగా శివాలాల్ యాదవ్, హర్షద్ అయూబ్ ప్యానల్
క్రికెట్‌ను అభివృద్ధి చెయ్యడమే తమ ఎజెండాఅని ప్రకటించారు. అవినీతి, రాజకీయ పలుకుబడి లేకుండా అర్హత కలిగిన క్రీడాకారులకు అవకాశాలు ఇస్తామన్నారు. ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, క్రికెట్ మీద దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అనుభవం ఉన్న కోచ్‌ల ద్వారా క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని, సెలక్షన్ పారదర్శకంగా జరిగే విధంగా పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.
