Anil Kumble : నా దురదృష్టం సర్ఫరాజ్ ఖాన్‌కు అంటుకున్న‌ట్లుంది.. అనిల్ కుంబ్లే వ్యాఖ్య‌లు వైర‌ల్‌

టీమ్ఇండియా యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ అరంగ్రేట టెస్టు మ్యాచ్‌లోనే ఆక‌ట్టుకున్నాడు.

Anil Kumble : నా దురదృష్టం సర్ఫరాజ్ ఖాన్‌కు అంటుకున్న‌ట్లుంది.. అనిల్ కుంబ్లే వ్యాఖ్య‌లు వైర‌ల్‌

Anil Kumble remarks on Sarfaraz Khan's unlucky run out on India debut

Anil Kumble – Sarfaraz Khan : టీమ్ఇండియా యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ అరంగ్రేట టెస్టు మ్యాచ్‌లోనే ఆక‌ట్టుకున్నాడు. రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో అత‌డు హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. గ‌త కొన్నాళ్లుగా దేశ‌వాలీ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తున్న స‌ర్ఫ‌రాజ్‌కు సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌రువాత టీమ్ఇండియాలో చోటు ద‌క్కింది. రాక రాక వ‌చ్చిన అవ‌కాశాన్ని అత‌డు రెండు చేతుల‌తో ఒడిసిప‌ట్టుకున్నాడు.

ఎలాంటి త‌డ‌బాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. 66 బంతులు ఎదురొన్న స‌ర్ఫ‌రాజ్ 62 ప‌రుగులు చేశాడు. అయితే.. దుర‌దృష్ట‌వ‌శాత్తు అత‌డు ర‌నౌట్ అయ్యాడు. ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా త‌ప్పిదం కార‌ణంగానే అత‌డు పెవిలియ‌న్‌కు చేరుకోవాల్సి వ‌చ్చింది.

అనిల్ కుంబ్లే చేతుల మీదుగా..

కాగా.. మ్యాచ్‌కు ముందు దిగ్గ‌జ ఆట‌గాడు అనిల్ కుంబ్లే చేతుల మీదుగా స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అరంగ్రేట క్యాప్‌ను అందుకున్నాడు. విధి విచిత్ర‌మో ఏమో తెలియ‌దు గానీ అనిల్ కుంబ్లే కూడా త‌న మొద‌టి మ్యాచ్‌లో ర‌నౌట్‌గానే ఔట్ అయ్యాడు. తొలి రోజు మ్యాచ్ ముగిసిన అనంత‌రం అనిల్ కుంబ్లే ఈ విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ర‌నౌట్ పై స్పందిస్తూ.. అరంగ్రేట క్యాప్‌తో పాటు త‌న బ్యాడ్ ల‌క్‌ను కూడా అత‌డికి ఇచ్చిన‌ట్లు ఉన్నాను అని కుంబ్లే స‌ర‌దాగా అన్నాడు.

Ravindra Jadeja : త‌ప్పునాదే.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ర‌వీంద్ర జ‌డేజా..

జ‌డ్డూతో నెల‌కొల్పిన భాగ‌స్వామ్యంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సంపూర్ణ ఆధిప‌త్యం చెలాయించాడు. ఈ స‌మ‌యంలో జ‌డేజా కాస్త సందిగ్ధంలో ప‌డిపోయి ఉండొచ్చు. ఇలాంటి స‌మ‌యాల్లో అత‌డు తీసుకునే కొన్ని విష‌యాల్లో గంద‌ర‌గోళం నెల‌కొనే ప‌రిస్థితులు ఉన్నాయి. బహుశా.. స‌ర్ఫ‌రాజ్ ర‌నౌట్‌కు ఇదీ ఓ కార‌ణం కావొచ్చున‌ని కుంబ్లే అభిప్రాయ‌ప‌డ్డాడు.