Ravindra Jadeja : త‌ప్పునాదే.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ర‌వీంద్ర జ‌డేజా..

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ దుర‌దృష్ట వ‌శాత్తు ర‌నౌట్ అయ్యాడు.

Ravindra Jadeja : త‌ప్పునాదే.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ర‌వీంద్ర జ‌డేజా..

Ravindra Jadeja apologizes Sarfaraz Khan

Ravindra Jadeja apologizes : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ దుర‌దృష్ట వ‌శాత్తు ర‌నౌట్ అయ్యాడు. తొలి రోజు ఆట ముగిసిన త‌రువాత ర‌వీంద్ర జ‌డేజా అరంగ్రేట ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. చాలా బాధ‌గా ఉంది స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌. త‌ప్పు నాదే. నువ్వు బాగా ఆడావు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లో జ‌డేజా రాసుకొచ్చాడు. జ‌డేజా క్ష‌మాప‌ణ‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అస‌లేం జ‌రిగిందంటే..?

ఇన్నింగ్స్ 82 ఓవ‌ర్‌ను జేమ్స్ అండ‌ర్స‌న్ వేశాడు. ఆ స‌మ‌యంలో 99 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద జ‌డేజా స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఉన్నాడు. ఆ ఓవ‌ర్‌లోని ఐదో బంతికి జ‌డేజా షాట్ ఆడి ప‌రుగుకు పిలిచాడు. వెంట‌నే స్పందించిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ప‌రుగు కోసం ముందుకు వెళ్లాడు. అయితే.. బంతి ఫీల్డ‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌డంతో జ‌డేజా ప‌రుగు పై వెన‌క్కి త‌గ్గాడు.

CV Anand : ఇప్ప‌టికే ఐదు సంవ‌త్స‌రాలు లేటైంది.. స‌ర్ఫరాజ్ ఖాన్ అరంగ్రేటంపై ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీఆనంద్‌

అప్ప‌టికే బంతిని అందుకున్న మార్క్‌వుడ్ డైరెక్టు త్రో వేశాడు. బాల్ వికెట్ల‌ను ప‌డ‌గొట్టింది. అయితే.. అప్ప‌టికి స‌ర్ఫ‌రాజ్ ఖాన్ క్రీజును చేరుకోక‌పోవ‌డంతో అత‌డు ర‌నౌట్ అయ్యాడు. దీంతో అరంగ్రేట ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, అత‌డి తండ్రితో పాటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నిరాశ‌ను వ్య‌క్తం చేశారు.

ఈ మ్యాచ్‌లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఔటైన త‌రువాత స‌ర్ఫ‌రాజ్ ఖాన్ బ్యాటింగ్‌కు దిగాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నాడు. 66 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్స్‌తో 62 ప‌రుగులు చేశాడు.