Anushka Sharma: ఆ ఫొటోలు పబ్లిష్ చేయనందుకు మీడియాకు థ్యాంక్స్ – విరుష్కా
అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీ తమ కూతురిని చాలా ప్రొటెక్టివ్ గా చూసుకుంటారో చాలా సందర్భాల్లో రుజువైంది. మీడియా కన్ను సైతం పడకుండా కేర్ తీసుకునే వాళ్లు.. రీసెంట్ గా మరోసారి తమ కూతురు..
- Subhan Ali Shaik
- Published On : December 20, 2021 / 07:03 AM IST
Vamika
Anushka Sharma: అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీ తమ కూతురిని చాలా ప్రొటెక్టివ్ గా చూసుకుంటారో చాలా సందర్భాల్లో రుజువైంది. మీడియా కన్ను సైతం పడకుండా కేర్ తీసుకునే వాళ్లు.. రీసెంట్ గా మరోసారి తమ కూతురు వామికా ఫొటోలు పోస్ట్ చేయకపోవడంపై అనుష్క రెస్పాండ్ అయ్యారు. ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వస్తుండగా వారిద్దరినీ క్లిక్‌మనిపించిన ఫొటోగ్రాఫర్లను కూతురి ఫొటోలు తీయొద్దంటూ విరాట్ రిక్వెస్ట్ చేశారు.
‘మా కూతురి ఫొటోలు పబ్లిష్ చేయని ఇండియన్ మీడియాకు థ్యాంక్స్. పేరెంట్స్ గా మా కూతురి ఫొటోలు ఉన్న వారెవరూ వాటిని పబ్లిష్ చేయకూడదనే అనుకుంటున్నాం. మా బిడ్డగా ఉన్నంతవరకూ తన ప్రైవసీని కాపాడాలనుకుంటున్నాం. సోషల్ మీడియా, మీడియాకు దూరంగా ఉండేందుకు అవకాశం కల్పిస్తున్నాం’
‘ఎదుగుతున్న కొద్దీ.. ఆమెను కట్టడి చేయం. తనకు నచ్చినట్లుగా ఉంటుంది. ఇంటర్నెట్ యూజర్లకు, ఫ్యాన్స్ క్లబ్ లకు ఆమె ఫొటోలు పోస్ట్ చేయనందుకు థ్యాంక్స్. ఇది చాలా దయతో పాటు మెచ్యూరిటీకి సంబంధించిన విషయం’ అని రాసి ఉంది.
