Omicron Variant : వామ్మో ఒమిక్రాన్.. ఒక్కరోజే 10వేల కేసులు నమోదు

ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. ఒక్కరోజే 10వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు రావడం ఆందోళనకు గురి చేస్తోంది.

Omicron Variant : వామ్మో ఒమిక్రాన్.. ఒక్కరోజే 10వేల కేసులు నమోదు

Omicron Variant

Omicron Variant : యూకేలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. అక్కడ రోజువారీ కేసుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. ఒక్కరోజే 10వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు రావడం ఆందోళనకు గురి చేస్తోంది. అలాగే ఒమిక్రాన్ మరణాల సంఖ్య ఏడుకి చేరింది.

గత 24 గంటల్లో బ్రిటన్ లో 90వేల కొవిడ్‌ కేసులు బయటపడగా అందులో 10వేల కేసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌వే. శుక్రవారం రోజున 3వేల 201 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. మరుసటి రోజు ఈ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. శనివారం ఒక్కరోజే 10వేల 059 కొత్త వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 24,968కి పెరిగినట్లు యూకే ఆరోగ్య భద్రతా సంస్థ తెలిపింది. గత 24 గంటల్లో యూకేలో 90వేల 148 కరోనా కేసులు నమోదవగా, 125మంది చనిపోయారు. కాగా, ప్రపంచంలో ఒమిక్రాన్‌ వేరియంట్ తో తొలి మరణం చోటు చేసుకుంది బ్రిటన్‌లోనే.

Child Pornography : షాకింగ్.. టీచర్ దగ్గర లక్షలకొద్దీ చిన్నారుల నీలి చిత్రాలు, వీడియోలు.. అరెస్ట్

ఒమిక్రాన్ కేసులు పెరిగినా.. కొవిడ్‌ విజృంభణ సమయంలో ఆస్పత్రిలో చేరికలతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగానే ఉండటం కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం అని అధికారులు అంటున్నారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ వెంటిలేటర్‌ అవసరమయ్యే కేసుల సంఖ్య తక్కువగానే ఉందని లండన్‌ మేయర్‌ సాదిక్‌ అన్నారు. మరోవైపు ఇంగ్లాండ్‌తో పాటు బ్రిటన్‌ వ్యాప్తంగా కొవిడ్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అటు వేల్స్‌లోనూ క్రిస్మస్‌ తర్వాత పలు ఆంక్షలు విధించనున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

Dog Killer Monkeys : హమ్మయ్య.. కిల్లర్ కోతులు చిక్కాయి.. ప్రతీకారంతో 250 కుక్కలను హత్య చేసిన ఆ రెండు వానరాలను బంధించారు

ఇదిలా ఉంటే, ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు రెండు డోసుల వ్యాక్సిన్‌ సరిపోదని ఇటీవల వెల్లడైన నివేదికలు చెబుతున్నాయి. బూస్టర్‌ ఇవ్వడం వల్ల రక్షణ మరింత పెరుగుతుందని అంటున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్‌లో 60శాతానికిపైగా 40ఏళ్లు దాటిన పౌరులు బూస్టర్‌ డోసు తీసుకున్నారు.