Dog Killer Monkeys : హమ్మయ్య.. కిల్లర్ కోతులు చిక్కాయి.. ప్రతీకారంతో 250 కుక్కలను హత్య చేసిన ఆ రెండు వానరాలను బంధించారు

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250 కుక్క‌ పిల్లల‌ను ఓ కోతుల గుంపు నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్ గావ్ లో

Dog Killer Monkeys : హమ్మయ్య.. కిల్లర్ కోతులు చిక్కాయి.. ప్రతీకారంతో 250 కుక్కలను హత్య చేసిన ఆ రెండు వానరాలను బంధించారు

Killer Monkeys

Dog Killer Monkeys : ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250 కుక్క‌ పిల్లల‌ను ఓ కోతుల గుంపు నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్ గావ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతీకారంతో రగిలిపోయిన కోతులు ఏకంగా 250 కుక్కపిల్లలను మాయం చేశాయి. కోతులేంటి? ప్రతీకారంతో రగిలిపోవడం ఏంటి? అని స్థానికులే కాదు దీని గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఊళ్లోని కుక్కపిల్లలను మాయం చేసిన వానరాలు ఆ తర్వాత చిన్నపిల్లలపై దాడి చేయడం మొదలు పెట్టాయి. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు కిల్లర్ కోతులను బంధించగలిగారు. కోతుల గుంపులోని ప్రధానమైన రెండు కోతులను అధికారులు పట్టుకుని బోనులో బంధించారు. మాజల్ గావ్ లోని లౌల్ గ్రామంలో శనివారం ఉదయం రెండు కిల్లర్ కోతులను పట్టుకున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కిల్లర్ కోతుల గురించి ఫిర్యాదులు రావడంతో తాము బోను ఏర్పాటు చేశామని, శనివారం తెల్లవారుజామున ఆ బోనులో రెండు కోతులు చిక్కాయని అధికారులు వివరించారు. ఆ రెండు కోతులను ఔరంగాబాద్ లోని గౌతాలా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి తీసుకెళ్లి వదిలేశామని అధికారులు తెలిపారు. కోతుల గుంపులోని కిల్లర్ కోతులు చిక్కాయనే వార్తతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Drinks To Burn Fat : పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే ఈ పానీయాలు ట్రై చేసి చూడండి

మనుషులు ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకోవడం తెలిసిందే. అందులో వింత లేదు, విచిత్రమూ లేదు. అయితే జంతువులకు కూడా పగలు, ప్రతీకారాలు ఉంటాయా? అంటే అవుననే సమాధానమిచ్చారు మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్ గావ్ ప్రజలు. మాజల్ గావ్ లోని లౌల్ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో ఏకంగా 250 కుక్కుపిల్లలను కోతులు చంపేసిన వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కుక్కలను.. కోతులు ఇంత దారుణంగా చంపేయడానికి ప్రతీకారమే కారణమని గ్రామస్తులు తెలపడం మరింత సంచలనమైంది.

మాజల్ గావ్ లోని లౌల్ గ్రామంలో నెల రోజుల క్రితం కుక్కల గుంపు ఓ కోతి పిల్లను వెంటాడి, వేటాడి.. కరిచి చంపేశాయి. ఆ ఘ‌ట‌న‌ను చూసి మిగతా కోతులు చ‌లించిపోయాయి. ప్రతీకారంతో రగిలిపోయాయి. కుక్కులపై పగబట్టిన కోతుల గుంపు అప్పటినుంచి ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. కుక్కపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. కోతులన్నీ గుంపుగా వెళ్లి రౌండప్ చేసి ఎత్తుకెళ్లడం, చెట్లు, భవనాల పైనుంచి వాటిని కిందికి తోసేసి చంపేయడం.. కొద్దిరోజులుగా ఆ ప్రాంతంలో ఇదే తంతు. ఒకవేళ అప్పటికీ చనిపోకపోతే.. మళ్లీ పైకి తీసుకెళ్లి కిందపడేస్తున్నాయట. ఈ విధంగా నెల రోజుల్లోనే ఏకంగా 250 కుక్క పిల్లలను కోతుల గుంపు పొట్టన పెట్టుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Chicken : చికెన్ అతిగా తింటున్నారా…అయితే జాగ్రత్త?

5వేల మంది జనాభా ఉండే లౌల్ లో ప్రస్తుతం ఒక్క కుక్కపిల్ల కూడా బతికి లేదని గ్రామస్తులు వాపోయారు. కోతుల బారి నుంచి కుక్కపిల్లలను కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్క‌ల‌ను చంప‌డం పూర్త‌య్యాక‌.. త‌మ ప్ర‌తీకారం తీరాక‌.. కోతులు ఊళ్లో ఉన్న చిన్న‌పిల్ల‌ల మీద త‌మ ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాయ‌ట‌. చిన్నారులపైనా కోతులు దాడులకు పాల్పడుతుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వానరాల నుంచి తమను కాపాడాలని అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.