Child Pornography : షాకింగ్.. టీచర్ దగ్గర లక్షలకొద్దీ చిన్నారుల నీలి చిత్రాలు, వీడియోలు.. అరెస్ట్

ఇటలీలోని అంకోనాలో ఓ సంగీతకారుడిని (49) అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి దగ్గర లక్షలకొద్దీ చిన్నారుల నగ్న ఫొటోలు, వీడియోలు చూసి నోరెళ్లబెట్టారు. అంతేకాదు, చిన్నారులతో పెద్దలు శృంగారంలో

Child Pornography : షాకింగ్.. టీచర్ దగ్గర లక్షలకొద్దీ చిన్నారుల నీలి చిత్రాలు, వీడియోలు.. అరెస్ట్

Child Pornography

Child Pornography : అతడో మ్యూజిక్ టీచర్. పిల్లలకు సంగీతం నేర్పిస్తాడు. బయటి ప్రపంచానికి ఇంతవరకే తెలుసు. అతడిలో మరో భయంకరమైన కోణం కూడా ఉంది. చిన్నారులపై అఘాయిత్యాలకు ప్రేరేపించే లక్షల కొద్దీ చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు, నీలి చిత్రాలు అతడి దగ్గరున్నాయి. ఈ విషయం బయటకు రావడంతో అంతా విస్తుపోతున్నారు.

ఇటలీలోని అంకోనాలో ఓ సంగీతకారుడిని(49) అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి దగ్గర లక్షలకొద్దీ  చిన్నారుల నగ్న ఫొటోలు, వీడియోలు చూసి నోరెళ్లబెట్టారు. అంతేకాదు, చిన్నారులతో పెద్దలు శృంగారంలో పాల్గొన్నట్టుగా చిత్రీకరించిన మిలియన్‌కు పైగా ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.

Chicken : చికెన్ అతిగా తింటున్నారా…అయితే జాగ్రత్త?

20ఏళ్లుగా అతడు వీటిని సేకరించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, వీటిని అతడు దుర్వినియోగం చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. ఫొటోలు, వీడియోలను బాధితుల వయసు వారీగా విభజించి ప్రత్యేక ఫోల్డర్లలో భద్రపరిచాడు. చిన్నారులకు అతడు సంగీత పాఠాలు చెప్పేవాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ్యూజిక్ టీచర్ గురించి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఇంటిపై దాడి చేశారు. అతడి ఇంట్లో లక్షల కొద్దీ చిన్నారుల నీలిచిత్రాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు లభ్యం కావడంతో షాక్ తిన్నారు. 49ఏళ్ల వయసున్న అతడు దాదాపు 30ఏళ్ల వయసు నుండే ఇలా చిన్నారుల నీలిచిత్రాల వీడియోల సేకరణ ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు.

Drinks To Burn Fat : పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే ఈ పానీయాలు ట్రై చేసి చూడండి

అయితే తన దగ్గర సంగీతం నేర్చుకోడానికి వచ్చే చిన్నారులను నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడడ్డా? వీడియోల చిత్రీకరణకు ఏమైనా ఉపయోగించాడా? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.