ఇండియన్ క్రికెటర్స్ ని పెళ్లి చేసుకున్న ఏడుగురు హీరోయిన్లు

  • Publish Date - April 7, 2020 / 02:08 PM IST

విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ:

ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల వివాహం ఇటలీలో జరిగింది. వీరిద్దరూ 2013లో ఒక షాంపూ యాడ్ లో కలుసుకున్నారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. కానీ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఇద్దరూ విడిపోయారు… తర్వాత తిరిగి 2017లో వివాహం చేసుకున్నారు. 

యువరాజ్ సింగ్ అండ్ హాజెల్ కీచ్:


భారత్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ హాజెల్ కీచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తనని ఎప్పుడు కాఫీకి పిలిచిన కాదనకుండా వచ్చేది. ఆమెకి నా ప్రపోజల్ చెప్పడానికి సంవత్సరం పట్టింది. చివరికి 2015లో బాలిలోని బీచ్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2016లో వివాహం చేసుకున్నారు. 

జహీర్ ఖాన్ అండ్ సాగరిక:

చక్ దే ఇండియా ప్రీతీ సబర్వాల్ అని పిలువబడే సాగరికా ఇండియన్ మోడల్ ఇంకా జాతీయ స్థాయి అథ్లెట్. ఈమె 2017 ఏప్రిల్ 24న భారతీయ బౌలర్ వివాహం చేసుకుంది. చాలా కాలంగా ఎవరికీ తెలియకుండా వీళ్ళ రిలేషన్ను మెయింటెన్ చేసిన ఈ జంట… ఒకేసారి సోషల్ మీడియాలో వీరి నిశ్చితార్థం గురించి ప్రకటించారు. అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. 

హర్భజన్ సింగ్ అండ్ గీతా బాస్రా:

హర్భజన్ సింగ్ గీత 2015 లో వివాహం చేసుకున్నారు. అప్పటివరకు వాళ్ల రిలేషన్ ని ఎవరికీ తెలియనివలేదు. వీరికి హీనాయ అనే కుమార్తె కూడా ఉంది.

మన్సూర్ అలీ ఖాన్ పటాడి, షర్మిలా ఠాగూర్:

వీరిద్దరూ 1965లో కలుసుకున్నారు. వారి రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వీరు ప్రేమలో పడ్డారు. 1969లో పెళ్లి చేసుకున్నారు. 

మహమ్మద్ అజారుద్దీన్ అండ్ సంగీత బిజ్లాని:

ఇది 80వ దశకంలోని  కాంట్రవర్షియల్ లవ్ స్టోరీ. అజార్ ఆర్ ఒక క్రికెటర్ సంగీత బాలీవుడ్ యాక్టర్. వీరిద్దరూ మొదటిసారి కలిసినప్పుడే అజార్ సంగీతం చూసి ప్రేమలో పడిపోయాడు. అయితే వీరి ప్రేమ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వీరిద్దరూ 1996లో వివాహం చేసుకున్నారు కానీ 2010లో విడిపోయారని చెప్పారు.

మొహసీన్ ఖాన్ అండ్ రీనా రాయ్:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైనా రీనా రాయ్ పాకిస్థాన్ క్రికెటర్ మొహసీన్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. మొహసీన్ ఖాన్ బాలీవుడ్లో కూడా బత్వా రా, సాతి వంటి సినిమాల్లో నటించారు.