Arshdeep Singh : చ‌రిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్‌.. టీ20ల్లో ఏకైక భార‌త బౌల‌ర్‌..

Arshdeep Singh : టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు

Arshdeep Singh creates history became first Indian bowler to take 150 international t20 wickets

Arshdeep Singh : టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో ఓ వికెట్ ప‌డ‌గొట్ట‌డం ద్వారా అత‌డు ఈ ఘ‌న‌తను సాధించాడు.

ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 వికెట్ల‌ను తీసిన తొలి భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఇక ఓవ‌రాల్‌గా చూసుంటే తొమ్మిదో బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.

Tilak Varma : న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్ నేడే.. భారీ మైలురాయిపై తిల‌క్ వ‌ర్మ క‌న్ను..

ర‌షీద్ ఖాన్, ఆదిల్ ర‌షీద్‌, ఎహసాన్ ఖాన్, ఇష్ సోదీ, టిమ్ సౌథీ, హస‌రంగ‌, ముస్తాఫిజుర్ రెహ‌మాన్‌, ఆడ‌మ్ జంపాలు మాత్ర‌మే అర్ష్‌దీప్ సింగ్ కంటే ముందు 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

* ర‌షీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) – 120 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు
* ఆదిల్ ర‌షీద్ (ఇంగ్లాండ్) – 153 మ్యాచ్‌ల్లో 171 వికెట్లు
* ఎహసాన్ ఖాన్ (హాంగ్‌కాంగ్‌) – 119 మ్యాచ్‌ల్లో 165 వికెట్లు
* ఇష్ సోదీ (న్యూజిలాండ్‌) – 142 మ్యాచ్‌ల్లో 165 వికెట్లు
* టిమ్ సౌథీ (న్యూజిలాండ్) – 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు
* వ‌నిందు హస‌రంగ (శ్రీలంక‌) – 101 మ్యాచ్‌ల్లో 163 వికెట్లు
* ముస్తాఫిజుర్ రెహ‌మాన్ (బంగ్లాదేశ్‌) – 130 మ్యాచ్‌ల్లో 163 వికెట్లు
* ఆడ‌మ్ జంపా (ఆస్ట్రేలియా) – 118 మ్యాచ్‌ల్లో 153 వికెట్లు
* అర్ష్‌దీప్ సింగ్ (భార‌త్) – 103 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు