Asia Cup 2022: బంతులను జోరుగా బాదుతూ, నెట్స్‌లో సాధన చేస్తూ కొహ్లీ బిజీబిజీ.. వీడియో
నెట్స్‌లో సాధన చేస్తూ భారత క్రికెటర్ విరాట్ కొహ్లీ బిజీబిజీగా ఉన్నాడు. టీమిండియా బౌలర్లు విసిరిన బంతులను జోరుగా బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యూఏఈలో ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ జరగనున్న విషయం తెలిసిిందే. దీన్ని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్ కోసం టీమిండియా సాధన చేస్తోంది. భారత్ రోహిత్ శర్మ సారథ్యంలో ఈ టోర్నమెంట్ ఆడనుంది.
- T Venkateshwarlu
- Updated on- August 25, 2022 / 11:54 AM IST
Asia Cup 2022
Asia Cup 2022: నెట్స్‌లో సాధన చేస్తూ భారత క్రికెటర్ విరాట్ కొహ్లీ బిజీబిజీగా ఉన్నాడు. టీమిండియా బౌలర్లు విసిరిన బంతులను జోరుగా బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యూఏఈలో ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ జరగనున్న విషయం తెలిసిిందే. దీన్ని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్ కోసం టీమిండియా సాధన చేస్తోంది. భారత్ రోహిత్ శర్మ సారథ్యంలో ఈ టోర్నమెంట్ ఆడనుంది.
ఈ టోర్నమెంట్ లో విరాట్ కొహ్లీ కూడా ఆడుతున్నాడు. ఎల్లుండి నుంచే ఆసియా కప్ మ్యాచులు ప్రారంభం అవుతుండడంతో కొహ్లీ ప్రాక్టీసులో చెమటోడుస్తున్నాడు. ఇటీవల కొహ్లీ ఆటతీరు సరిగ్గా ఉండడం లేదు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆసియా కప్ ద్వారా మళ్ళీ ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. ఆసియా కప్ ను దుబాయి, షార్జాలో నిర్వహిస్తున్నారు. భారత ఆటగాళ్ళు అందరూ ప్రాక్టీస్ లో తలామునకలయ్యారు. ఆసియా కప్ లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఈ నెల 28న భారత్-పాకిస్థాన్ తలబడనున్నాయి.
