Asian Games 2026 : ఆసియా క్రీడల్లో సెమీస్‌కు భారత్.. ఒక్క బంతి ఆడకుండానే.. అంతా వరుణ మాయ..
ఆసియా క్రీడలు 2026లో (Asian Games 2026) భారత జట్టు సెమీస్‌కు చేరుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- September 28, 2026 / 10:27 AM IST
Asian Games 2026 India vs Afghanistan Match abandoned without toss
Asian Games 2026 : ఆసియా క్రీడలు 2026లో భారత జట్టు సెమీస్‌కు చేరుకుంది. నేడు అఫ్గానిస్థాన్‌తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కనీసం టాస్ కూడా వేసే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
ఈ క్రమంలో టీ20ల్లో అఫ్గానిస్థాన్ కంటే మెరుగైన ర్యాంకింగ్ కలిగిన ఉన్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత్ జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకుంది. అక్టోబర్ 1న జరిగే సెమీఫైనల్‌లో భారత్.. శ్రీలంక లేదా నేపాల్‌తో తలపడనుంది.
కాగా.. ఈ ఉదయం జరగాల్సిన పాకిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. మెరుగైన టీ20 ర్యాంకింగ్స్ కలిగిన పాకిస్థాన్ సెమీస్‌కు చేరుకుంది.
Virat Kohli : సెంచరీ అనంతరం విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు.. నా లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలుసు..
🚨 Match Abandoned 🚨
The #INDvAFG Asian Games 2026 Quarter-Final has been called off due to rain. #TeamIndia advance to the semi-final by virtue of higher seeding. #AsianGames
— BCCI (@BCCI) September 28, 2026
ఇదిలా ఉంటే.. స్వర్ణ పతకం కోసం జరిగే ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 3న జరగనుంది.
