Asian Para Games 2026 : ఆసియా పారా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నిషాద్ కుమార్.. రెండో స్వర్ణం కైవసం..
Nishad Kumar Gold Medal : ఆసియా పారా గేమ్స్ 2026లో భారత అథ్లెట్ నిషాద్ కుమార్ మరోసారి సత్తా చాటాడు. పురుషుల హైజంప్ T47 విభాగంలో స్వర్ణ పతకం సాధించి భారత కీర్తి పతాకాన్ని ఎగురవేశారు.
- Harish Thanniru
- Published on- October 20, 2026 / 06:56 PM IST
Nishad Kumar Gold Medal
Nishad Kumar Gold Medal : ఆసియా పారా గేమ్స్ 2026లో భారత అథ్లెట్ నిషాద్ కుమార్ మరోసారి సత్తా చాటాడు. పురుషుల హైజంప్ T47 విభాగంలో స్వర్ణ పతకం సాధించి భారత కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. 2.04 మీటర్ల ఎత్తును అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పారు. దీంతో ఈ పోటీల్లో ఆయన ఖాతాలో రెండో స్వర్ణం చేరింది.
Also Read : Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్..? టీవీకే నేత కీలక కామెంట్స్..
జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో నిషాద్ కుమార్ వరుసగా రెండో రోజు స్వర్ణ పతకంతో మెరిశారు. సోమవారం పురుషుల లాంగ్‌జంప్ T47 విభాగంలో 7.11 మీటర్ల దూరం దూకి బంగారు పతకాన్ని సాధించగా.. మంగళవారం హైజంప్‌లోనూ తన ఆధిపత్యాన్ని చాటుతూ మరో స్వర్ణాన్ని అందుకున్నాడు. తన మొదటి ప్రయత్నాల్లోనే 1.88 మీటర్లు, 1.94 మీటర్లు, 1.98 మీటర్లు , 2.02 మీటర్ల ఎత్తును సునాయసంగా అతడు జంప్ చేశాడు. ఆ తర్వాత ఏకంగా 2.04 మీటర్ల ఎత్తును పంజ్ చేసి అగ్రస్దానంలో నిలిచి పసిడి పతకాన్ని ముద్దాడాడు. ఈ ప్రదర్శనతో భారత పతకాల ఖాతాకు మరో బంగారు పతకం చేరింది. ఈ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 26 పతకాలు సాధించింది.
అరుదైన ఘనత సాధించిన భారత అథ్లెట్..
ఒకే ఆసియా పారా గేమ్స్ ఎడిషన్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన మూడో భారత క్రీడాకారుడిగా నిషాద్ కుమార్ నిలిచారు. గతంలో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో అంకుర్ ధామా, ఆర్చర్ శీతల్ దేవి ఈ ఘనత సాధించారు. అంకుర్ ధామా పురుషుల 5,000 మీటర్లు, 1,500 మీటర్ల T11 విభాగాల్లో స్వర్ణాలు గెలవగా.. శీతల్ దేవి మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ విభాగాల్లో పసిడి పతకాలు సాధించారు.
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నిషాద్ కుమార్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆయనకు ఆరేళ్ల వయసులో కుటుంబం వ్యవసాయ క్షేత్రంలో గడ్డి కోసే యంత్రం వల్ల కుడి చేయి తీవ్రంగా దెబ్బతిని కోల్పోయాడు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ పారా అథ్లెటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
టోక్యో 2020, పారిస్ 2024 పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో రజత పతకాలు సాధించిన నిషాద్.. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పుడు ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. నిషాద్ కుమార్ అద్భుత ప్రదర్శనపై క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన విజయంతో భారత పారా అథ్లెటిక్స్‌కు మరింత గుర్తింపు లభించింది.
