Australia : పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఆసీస్ జట్ల ప్రకటన.. మాక్స్‌వెల్ ఎంత పనాయె..
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో ఆస్ట్రేలియా (Australia) అతి త్వరలో పరిమిత ఓవర్ల సిరీస్‌లను ఆడనుంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 11, 2026 / 12:35 PM IST
Australia announce squads for the Pakistan and Bangladesh white ball tours
- పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు జట్లను ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా
- పాట్ కమిన్స్ , జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌లకు విశ్రాంతి
Australia : పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో ఆస్ట్రేలియా అతి త్వరలో పరిమిత ఓవర్ల సిరీస్‌లను ఆడనుంది. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా ఆయా ఆయా సిరీస్‌ల కోసం జట్లను ప్రకటించింది. అండర్-19 కెప్టెన్ ఓలీ పీక్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక అయ్యాడు. అతడు పాకిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపిక అయినప్పటికి కూడా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు ఎంపిక కాలేదు.
పాట్ కమిన్స్ , జోష్ హేజిల్‌వుడ్ ఈ ఇద్దరికి ఈపర్యటనల నుంచి విశ్రాంతి ఇచ్చారు. ఇప్పటికే టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన మిచెల్ స్టార్క్ కూడా వన్డే సిరీస్‌లకు అయ్యాడు. కమిన్స్ గైర్హాజరీలో మిచెల్ మార్ష్ వన్డే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
Krunal Pandya : 2027 వన్డే ప్రపంచ కప్‌పై దృష్టి సారించిన కృనాల్ పాండ్యా.. బీసీసీఐకి కీలక సందేశం..
ట్రావిస్ హెడ్, కూపర్ కానలీ, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్ ప్లేఆఫ్స్ కోసం తమ ఐపీఎల్ ఫ్రాంచైజీలతోనే ఉండిపోనున్నారు. దీంతో పర్యటనకు వచ్చే జట్లను ఫార్మాట్ల వారీగా విభజించాల్సిన అవసరం సెలెక్టర్లకు ఏర్పడింది. ఈ నలుగురు జూన్ 9న ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌కు తిరిగి రానున్నారు. ఇక ఎంపికకు అందుబాటులో ఉన్నప్పటికీ, గ్లెన్ మాక్స్‌వెల్‌ను బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు.
మే 30న ఆసీస్ పాక్ పర్యటనకు వెళ్లనుండగా.. ఆ తరువాత జూన్ 9న బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది.
పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు ఆసీస్ జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ , నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, రిలే మెరెడిత్, ఓలీ పీక్, మాథ్యూ రెన్‌షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, మాథ్యూ షార్ట్, బిల్లీ స్టాన్లేక్, ఆడమ్ జంపా
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ఆసీస్ జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, మాథ్యూ రెన్‌షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపా
Andy Flower : ముంబై పై విజయం.. ఆర్‌సీబీ పై బీసీసీఐ చర్యలు షురూ.. హెడ్ కోచ్‌కు 15 శాతం జరిమానా
బంగ్లాదేశ్‌తో టీ20 జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రైలీ మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్‌షా, ఆడమ్ జంపా
