Team India
Test Rankings : కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. దీంతో మంచి జోష్‌లో ఉన్న భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్, వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచుల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా మరోసారి గట్టి దెబ్బకొట్టింది.
గతకొంతకాలంగా టెస్టుల్లో నంబర్ వన్‌గా కొనసాగుతున్న భారత్ తన ర్యాంకును కోల్పోయింది. కేప్‌టౌన్ టెస్టులో గెలిచినా సిరీస్‌ను డ్రా (1-1) చేసుకోవడం భారత పాయింట్ల పై ప్రభావం చూపించింది. అదే సమయంలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో ఆసీస్ కైవసం చేసుకోవడంతో టెస్టుల్లో ఆస్ట్రేలియా నంబర్ వన్ స్థానానికి దూసుకువచ్చింది.
Babar Azam trolling : జింబాబ్వే, నేపాల్ పైనే నీ ప్రతాపం.. బాబర్ ఆజం పై దారుణ ట్రోలింగ్..!
118 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. 117 రేటింగ్ పాయింట్లతో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆ తరువాత ఇంగ్లాండ్ (115), దక్షిణాప్రికా (106), న్యూజిలాండ్ (95) లు వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్ (92) ఆరు, శ్రీలంక (79) ఏడు, వెస్టిండీస్ (77) ఎనిమిది, బంగ్లాదేశ్ (51) తొమ్మిది, జింబాబ్వే (32) పదో స్థానంలో ఉంది.
భారత్‌కు మళ్లీ అవకాశం..!
టీమ్ఇండియా ప్రస్తుతం వన్డేల్లో, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టెస్టుల్లో రెండో స్థానానికి పడిపోయింది. అయితే.. జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌ను గెలిస్తే భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వ్యత్సాసం కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ ఉండడమే ఇందుకు కారణం.
Virat Kohli : కోహ్లీ చేసిన పనికి దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ ఫిదా.. ఇది కదా కోహ్లీ అంటే..