Babar Azam trolling : జింబాబ్వే, నేపాల్ పైనే నీ ప్రతాపం.. బాబర్ ఆజం పై దారుణ ట్రోలింగ్..!
కెప్టెన్సీ ఒత్తిడి లేకపోవడంతో బాబర్ ఆజాం బ్యాటింగ్‌లో చెలరేగిపోతాడని భావించారు.
- Thota Vamshi Kumar
- Updated on- January 5, 2024 / 04:19 PM IST
Babar Azam
Babar Azam : భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ మెగాటోర్నీలో బాబర్ ఆజం కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ విఫలం అయ్యాడు. ఈ క్రమంలో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ తప్పకున్నాడు. కెప్టెన్సీ ఒత్తిడి లేకపోవడంతో బాబర్ ఆజం బ్యాటింగ్‌లో చెలరేగిపోతాడని భావించారు. అయితే అనూహ్యంగా బాబర్ ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలం అయ్యాడు.
మూడు టెస్టు మ్యాచుల్లో కనీసం ఒక్కదాంట్లోనూ హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన బాబర్ వరుసగా 21, 14, 1, 41, 26, 23 పరుగులు సాధించాడు. సగటు 21గా ఉంది. దీంతో నెట్టింట బాబర్ ఆజం పై ట్రోలింగ్ మొదలైంది. జింబాబ్వే, నేపాల్ వంటి జట్లతో మ్యాచులు ఆడించండి.. అప్పుడు నా ప్రతాపం చూపిస్తాను లేదంటే నేను రిటైర్ అయిపోతాను అంటూ బాబర్ అన్నట్లుగా పలువురు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
Virat Kohli : కోహ్లీ చేసిన పనికి దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ ఫిదా.. ఇది కదా కోహ్లీ అంటే..
