BAN vs PAK Whitewash: పాకిస్థాన్‌కు ఘోర పరాభవం.. బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్ వైట్‌వాష్..
BAN Pakistan Whitewash: టెస్టుల్లో పాకిస్థాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ చేతిలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను (BAN vs PAK) వైట్‌వాష్‌కు గురైంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 20, 2026 / 03:31 PM IST
BAN vs PAK Bangladesh create history They have whitewashed Pakistan for the first time at home
- పాకిస్థాన్‌కు భారీ షాక్
- బంగ్లాదేశ్ చేతిలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ వైట్‌వాష్
BAN vs PAK : టెస్టుల్లో పాకిస్థాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ చేతిలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను వైట్‌వాష్‌కు గురైంది. సిల్హెట్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. దీంతో 2-0 తేడాతో బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ (BAN vs PAK ) చేసి చరిత్ర సృష్టించింది. తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లా 104 పరుగుల తేడాతో గెలుపొందిందిన సంగతి తెలిసిందే.
437 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 358 పరుగులకే కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 316 పరుగులతో ఐదో రోజు ఆట కొనసాగించిన పాకిస్థాన్ మరో 42 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ రిజ్వాన్ ( 94) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. తెజుల్ ఇస్లాం ఆరు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.
కాగా.. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్ కాగా బదులుగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 232 పరుగులు చేసింది. దీంతో బంగ్లాకు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తరువాత ముష్ఫికుర్ రహీం (137) శతకంతో చెలరేగడంతో 390 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని పాక్ ముందు 437 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
