Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. తిలక్ వర్మకు అవకాశం.. ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఎంట్రీ
ఆసియా కప్ -2023 కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మెగా ఈవెంట్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
- Harish Thanniru
- Updated on- August 21, 2023 / 02:32 PM IST
Asia Cup 2023
Asia Cup 2023 Team India Squad: ఆసియా కప్ -2023 కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మెగా ఈవెంట్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆసియాకప్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. మరోవైపు గాయం నుంచి కోలుకుని ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు నాయకత్వం వహిస్తున్న బుమ్రాకు కూడా జట్టులో అవకాశం దక్కింది. ఢిల్లీలో జరిగిన సలెక్షన్ కమిటీ సమావేశంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీంను ఎంపిక చేసింది. జట్టులో హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ సంజూ శాంసన్ ను రిజర్వ్ ప్లేయర్ గా సెలక్టర్లు ఎంపిక చేశారు.
జట్టు వివరాలు ఇలా..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. సంజూ శాంసన్(రిజర్వ్ ప్లేయర్).
ఆసియాకప్ 2023 ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్థాన్ వర్సెస్ నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ తో ప్రారంభమవుతుంది. భారత్ జట్టు తన తొలి మ్యాచ్ సెప్టెన్ 2న దాయాది పాకిస్థాన్ జట్టుతో తలపడుతుంది.
ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆగస్టు 30 – పాకిస్థాన్ vs నేపాల్ – వేదిక ముల్తాన్
ఆగస్టు 31 – బంగ్లాదేశ్ vs శ్రీలంక – వేదిక క్యాండీ
సెప్టెంబర్ 2 – పాకిస్తాన్ vs భారతదేశం – వేదిక క్యాండీ
సెప్టెంబర్ 3 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక లాహోర్
సెప్టెంబర్ 4 – భారతదేశం vs నేపాల్ – వేదిక క్యాండీ
సెప్టెంబర్ 5 – శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక లాహోర్
సెప్టెంబర్ 6 – సూపర్ 4s – A1 vs B2 – వేదిక లాహోర్
సెప్టెంబర్ 9 – B1 vs B2 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 10 – A1 vs A2 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 12 – A2 vs B1 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 14 – A1 vs B1 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 15 – A2 vs B2 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 17 – ఫైనల్ – వేదిక కొలంబో
ఇక మ్యాచ్‌లు అన్ని భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం మూడు గంటలకు ప్రారంభం కానున్నాయి.
