SA-w vs IND-w : దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా జట్టు ఇదే..
భారత మహిళల జట్టు త్వరలో దక్షిణాఫ్రికాలో (SA-w vs IND-w ) పర్యటించనుంది.
- Thota Vamshi Kumar
- Published on- March 24, 2026 / 03:56 PM IST
BCCI announced India womens squad for South Africa T20I series
- దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్
- 15 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ
- హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో బరిలోకి
SA-w vs IND-w : భారత మహిళల జట్టు త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య సౌతాఫ్రికాతో భారత మహిళలు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నారు. ఏప్రిల్ 17న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత మహిళా జట్టును బీసీసీఐ ప్రకటించింది.
15 మంది సభ్యులు గల బృందానికి హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యహరించనున్నారు. ఆల్‌రౌండర్ అనుష్క శర్మకు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. కాష్వీ గౌతమ్ టీ20 అరంగ్రేటానికి సిద్ధమైంది.
ఇటీవల ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపికైన వైష్ణవి శర్మ, స్నేహ్ రాణా, జి.కమలినీ, అమన్‌జోత్ కౌర్ లకు దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు చోటు దక్కలేదు.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ , రిచా ఘోష్, అరుంధతి రెడ్డి , రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కష్వీ గౌతమ్, భారతీ ఫుల్మాలి, ఉమా ఛెత్రి, అనుష్క శర్మ
Rinku Singh : రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం!
భారత్, దక్షిణాఫ్రికా మహిళల టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – ఏప్రిల్ 17న (డర్బన్)
* రెండో టీ20 మ్యాచ్ – ఏప్రిల్ 19న (డర్బన్)
* మూడో టీ20 మ్యాచ్ – ఏప్రిల్ 22న (జోహన్నెస్‌బర్గ్)
* నాలుగో టీ20 మ్యాచ్ – ఏప్రిల్ 25న (జోహన్నెస్‌బర్గ్)
* ఐదో టీ20 మ్యాచ్ – ఏప్రిల్ 27న (బెనోని)
