IND vs SL : శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే.. జడేజా రీ ఎంట్రీ, కొత్త కుర్రాడికి చోటు.. బుమ్రా విషయంలో కండిషన్స్ అప్లై..
శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి జరగనున్న రెండు మ్యాచ్‌ల (IND vs SL)టెస్టు సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది
- Thota Vamshi Kumar
- Updated on- July 28, 2026 / 09:55 AM IST
BCCI announced Team India test squad for the Tour of Sri Lanka
IND vs SL : శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రీ ఎంట్రి ఇచ్చాడు. ఐపీఎల్ 2026లో టెన్నిస్ ఎల్బో గాయానికి గురైన జడేజా పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కండరాల గాయానికి గురైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి అతడు ఇంకా కోలుకోకపోవడంతో లంకతో తొలి టెస్టుకు అందుబాటులో లేడని సెలక్టర్లు తెలిపారు. సారాంశ్ జైన్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది.
ఆల్‌రౌండర్ అయిన సారాంశ్ జైన్.. మధ్యప్రదేశ్ తరపున 42 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 131 వికెట్లు సాధించాడు. ఇటీవల శ్రీలంక ‘ఎ’ జట్టుపై ఇండియా ‘ఎ’ తరపున అద్భుత ప్రదర్శనలతో చేయడంతో తొలిసారి చోటు దక్కించుకున్నాడు. కుడిచేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయడంతో పాటు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం గమనార్హం. అతను 60 ఇన్నింగ్స్‌లలో 25.98 సగటుతో 1,455 పరుగులు సాధించాడు.
జస్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌లను ఎంపిక చేసినప్పటికి కూడా వారు ఫిట్‌నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ నిరూపించుకుంటనే వారు టెస్టు సిరీస్‌లో ఆడతారు. లేదంటే ఆడరని సెలక్టర్లు తెలిపారు.
రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కన్నా ముందు భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆగస్టు 7న కొలంబోలో ఈ మ్యాచ్ జరగనుంది.
భారత్, శ్రీలంక టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టెస్టు – ఆగస్టు 15 నుంచి 19 వరకు – గాలే వేదికగా
* రెండో టెస్టు – ఆగస్టు 23 నుంచి 27 వరకు – కొలంబో వేదికగా
శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరన్ష్ జైన్.
🚨 News 🚨#TeamIndia‘s squad for the 2⃣-match Test Series against Sri Lanka announced
Note: Washington Sundar was not available for selection for the first Test.
More Details ▶️ https://t.co/Vk0Xd8Axmq #SLvIND pic.twitter.com/NuCcKBohMj
— BCCI (@BCCI) July 28, 2026
