Team India: వన్డే ప్రపంచకప్ కు భారత్ జట్టు ప్రకటన.. ఎవరెవరు ఉన్నారంటే?
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనబోయే భారత జట్టును మంగళవారం ప్రకటించారు.
- Naga Srinivasa Rao Poduri
- Updated on- September 5, 2023 / 02:20 PM IST
BCCI announces ICC World Cup 2023 squad
Team India – ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనబోయే భారత జట్టును మంగళవారం ప్రకటించారు. BCCI చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajith Agarkar) ఈ మేరకు జట్టు వివరాలు వెల్లడించారు. అన్ని అంశాలను పరిశీలించి 15 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేశామని.. ఎవరైనా గాయపడితే తప్పా మార్పులు ఉండబోవని అజిత్ అగార్కర్ తెలిపారు. యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్ లకు టీమ్ లో చోటు దక్కింది. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. కారు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న రిషబ్ పంత్ కు చోటు దక్కలేదు.
ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వైపు సెలక్షన్ కమిటీ మొగ్గు చూపింది. బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రపంచకప్ కు ఎంపికయ్యారు. సంజూ శామ్సన్ మరోసారి మొండిచేయి చూపారు. స్పిన్నర్లు యజువేంద్ర చహల్, అశ్విన్ కు నిరాశే ఎదురయింది. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీకి మరోసారి అవకాశం ఇచ్చారు. మహ్మద్ సిరాజ్,
ప్రపంచకప్ జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, KL రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
