కోహ్లీ సేనకు బీసీసీఐ గుడ్ న్యూస్ ప్రకటించింది. విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియాకు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చింది. విదేశీ పర్యటనలో జీతాలను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించిన అంతకుముందున్న జీతాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడంతో వెస్టిండీస్ పర్యటనను విజయంతో ముగించిన భారత జట్టుకు ఉత్సాహం పెంచేలా చేసింది.
సొంతగడ్డలపై రోజుకు వంద డాలర్లు తీసుకుంటున్న ప్లేయర్లకు జీతాలను ఫిక్స్ చేయాలనుకుంటుంది. అంటే రోజుకు రూ.7వేల 500ఇవ్వనున్నారు. అదే విదేశాలకు వెళ్తే మాత్రం రోజుకు 250డాలర్లు ఇస్తారు. మిగిలిన ఖర్చులన్నీ బీసీసీఐనే భరిస్తోంది. బిజినెస్ క్లాస్ ట్రావెల్‌లో ప్రయాణం, వసతి, లాండ్రీ ఖర్చులకు సొంత డబ్బులు తీయాల్సిన అవసరమే లేదు.
మ్యాచ్ ఫీజులతో పాటుగానే కొత్త వేతనాలను బీసీసీఐ ప్లేయర్లకు అందించనుంది. ప్లేయర్ల వేతనాలు టెస్టు మ్యాచ్‌కు రూ.15లక్షలు, వన్డేలకు రూ.6లక్షలు, టీ20లకు రూ.3లక్షలుగా ఉంది. అయితే ఇదంతా తుది 11మంది ప్లేయర్లు మాత్రమే. మరి ఆ జాబితాలో లేని వాళ్ల సంగతి గ్రేడ్ లను బట్టి ఉంటుంది. (ఏ ప్లస్ గ్రేడ్‌కు రూ.7కోట్లు, ఏ గ్రేడ్‌కు రూ.5కోట్లు, బీ గ్రేడ్‌కు రూ.3కోట్లు, సీ గ్రేడ్‌కు రూ.కోటి)