Team India : నేడే టీ20 జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. 15 ఏళ్ల బుడ్డోడికి, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ల‌కు చోటు ద‌క్కేనా?

ఐర్లాండ్‌, ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌ల‌తో స‌హా ఆసియా క్రీడ‌ల‌కు భార‌త టీ20 జ‌ట్టును (Team India) శనివారం సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌నున్నారు.

BCCI set to be Today announce India squads for the upcoming T20I series and the Asian Games

  • శ‌నివారం స‌మావేశం కానున్న సెల‌క్ట‌ర్లు
  • ఐర్లాండ్‌, ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌ల‌తో స‌హా ఆసియా క్రీడ‌ల‌కు భార‌త టీ20 జ‌ట్ల‌ను ఎంపిక
  • వైభ‌వ్ సూర్య‌వంశీ, భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌ల‌కు చోటు ద‌క్కేనా?

Team India : ఐర్లాండ్‌, ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌ల‌తో స‌హా ఆసియా క్రీడ‌ల‌కు భార‌త టీ20 జ‌ట్టును శనివారం సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌నున్నారు. టీమ్ఇండియాకు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అందించిన‌ప్ప‌టికి కూడా పేల‌వ ఫామ్‌తో ఇబ్బంది ప‌డుతున్న సూర్య‌కుమార్ యాద‌వ్ పై కెప్టెన్‌గానే కాకుండా ఆట‌గాడిగానూ వేటు ప‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. శ్రేయ‌స్ అయ్య‌ర్ భార‌త టీ20 జ‌ట్టు కొత్త కెప్టెన్‌గా ఎంపిక అవ్వ‌డం లాంఛ‌న‌మేన‌ని తెలుస్తోంది.

ఇక తెలుగు కుర్రాడు, మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ‌కు వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయి. 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీకి తొలిసారి జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కొచ్చున‌ని ప‌లువురు క్రీడా విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. సీనియ‌ర్ పేస‌ర్ ష‌మీని సెల‌క్ట‌ర్లు మ‌రోసారి విస్మ‌రించ‌వ‌చ్చున‌ని అంటున్నారు.

Rishabh Pant : అఫ్గాన్‌తో ఏకైక టెస్టు.. రిష‌బ్ పంత్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..

ఇక ఐపీఎల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన 36 ఏళ్ల భువ‌నేశ్వ‌ర్ కుమార్ విష‌యంలో సెల‌క్ట‌ర్లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లీష్ పిచ్‌ల‌పై భువీకి మంచి రికార్డు కూడా ఉంది. అయితే.. జ‌ట్టు దీర్ఘ‌కాల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అత‌డిని ఎంపిక చేయ‌డం క‌ష్టం అని స‌మాచారం.

భార‌త జ‌ట్టు తొలుత ఐర్లాండ్‌లో ప‌ర్య‌టించ‌నుంది. రెండు టీ20 మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. జూన్ 26, 26 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. ఆ త‌రువాత ఇంగ్లాండ్‌కు ప‌ర్య‌టన‌కు వెళ్ల‌నుంది. ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ 5 టీ20లు, మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. తొలుత టీ20 సిరీస్ జూలై1 నుంచి ప్రారంభం కానుంది. ఇక‌ సెప్టెంబ‌రులో జ‌పాన్‌లో ఆసియా క్రీడ‌లు జ‌ర‌గ‌నున్నాయి.