Uttar Pradesh : క్రికెట్‌లో విషాదం.. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి.. మ్యాచ్ జరుగుతుండగానే..
తేనెటీగల దాడిలో అంపైర్ మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో చోటు చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : February 19, 2026 / 11:31 AM IST
Bee swarm kills umpire during cricket match in Uttar Pradesh
Uttar Pradesh : తేనెటీగల దాడిలో అంపైర్ మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా తేనెటీగల గుంపు దాడి చేసింది. ఈ క్రమంలో మైదానంలో ఉన్న అనేక మంది గాయపడ్డారు. పలువురు ఆస్పత్రి పాలు అయ్యారు.
వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-13 క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఓ మ్యాచ్‌కు 65 ఏళ్ల మాణిక్ గుప్తాతో పాటు జగదీష్ శర్మ లు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
T20 World Cup 2028 : టీ20 ప్రపంచప్ 2028కి నేరుగా అర్హత సాధించిన జట్లు ఇవే.. ప్రకటించిన ఐసీసీ
అయితే.. మ్యాచ్ మధ్యలో తేనెటీగల గుంపు అక్కడ ఉన్న వారిపై దాడి చేసింది. దీంతో అక్కడ ఉన్న వారు తేనెటీగల బారి నుంచి కాపాడుకునేందుకు అక్కడ నుంచి పరుగులు తీశారు.
ఈ ఘటనలో మాణిక్ గుప్తా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సహచరులు, అధికారులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. గుప్తా దాదాపు 30 సంవత్సరాలుగా కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. అనేక ప్రాంతీయ మ్యాచ్‌లకు అతడు అంపైర్‌గా పని చేశాడు.
2019లో ఇలాంటి ఘటననే జరిగింది. తిరువనంతపురంలో ఇండియా ఏ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తేనెటీగలు స్టేడియంలో ఆకస్మాత్తుగా దాడి చేశాయి. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. తేనెటీగల దాడిలో చాలా మంది గాయపడినప్పటికి అప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
