Bhuvneshwar Kumar : బిగ్ బ్రేకింగ్‌.. వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్.. భువ‌నేశ్వ‌ర్‌ కుమార్‌ను జ‌ట్టులోకి తీసుకున్న బీసీసీఐ

వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్ కోసం భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను (Bhuvneshwar Kumar ) బీసీసీఐ జ‌ట్టులోకి తీసుకుంది.

Bhuvneshwar Kumar added to the squad for the Bengaluru T20I against west indies

Bhuvneshwar Kumar : టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆటగాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్ న్యూజిలాండ్‌తో సిరీస్ క‌న్నా ముందుగానే భార‌త జ‌ట్టు త‌రుపున రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. శ‌నివారం వెస్టిండీస్‌తో బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఐదో టీ20 మ్యాచ్‌లో ఆడే అవ‌కాశం ఉంది.

ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌గా అర్ష్‌దీప్ సింగ్ భుజానికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికి కూడా అత‌డిని జ‌ట్టులో కొన‌సాగిస్తూనే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌ను బీసీసీఐ జ‌ట్టులోకి తీసుకుంది. అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే కివీస్ సిరీస్ క‌న్నా ముందే అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో భువీని చూడొచ్చు. అత‌డు నాలుగేళ్ల త‌రువాత భార‌త్‌కు ఆడ‌నున్నాడు.

ఐపీఎల్‌లో భువీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్‌సీబీకి చిన్న‌స్వామి హోం గ్రౌండ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న‌కు అచ్చొచ్చిన చిన్న‌స్వామిలో అత‌డు చెల‌రేగాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆఖ‌రి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఆడే అవ‌కాశం లేదా?

ఉప్ప‌ల్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో విండీస్ బౌల‌ర్ ష‌మార్ జోసెఫ్ వేసిన బంతి అర్ష్‌దీప్ సింగ్ భుజానికి బ‌లంగా తాకింది. అత‌డు నొప్పితో విల‌విల‌లాడిపోయాడు. బ్యాటింగ్ కొన‌సాగించేందుకు ఇబ్బంది ప‌డ‌డంతో రిటైర్డ్ ఔట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం ఐదో టీ20 మ్యాచ్ కోసం అత‌డిని జ‌ట్టులోనే ఉంచినా కూడా.. అత‌డు గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధిస్తేనే తుది జ‌ట్టులో ఉంటాడ‌ని బీసీసీఐ తెలిపింది.

ఇప్ప‌టికే సిరీస్ 2-2తో స‌మంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆఖ‌రి మ్యాచ్‌లో ఎవ‌రు గెలిస్తే వారిదే సిరీస్ కావ‌డంతో ముందు జాగ్ర‌త్తగా భువీని ఎంపిక చేశారు.

వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్ కోసం భార‌త జ‌ట్టు ఇదే..

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్‌ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నమన్ ధీర్, భువనేశ్వర్ కుమార్.