Rishabh Pant : టీమ్ఇండియాకు బిగ్‌షాక్.. గాయం నుంచి ఇంకా కోలుకోని పంత్.. న్యూజిలాండ్-ఏతో మూడో అన‌ధికారిక టెస్టుకు దూరం!

Rishabh Pant : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిషబ్ పంత్ మైదానంలో అడుగుపెట్టేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టేలా ఉంది.

Big Blow For Team India Rishabh Pant Miss 3rd Unofficial Test vs New Zealand A

Rishabh Pant : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిషబ్ పంత్ మైదానంలో అడుగుపెట్టేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. న్యూజిలాండ్‌-ఏతో జ‌రుగుతున్న అన‌ధికారిక టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల‌కు దూరం అయిన పంత్ శ‌నివారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టుకు సైతం దూరం కానున్నాడు.

ఇరానీ క‌ప్ సంద‌ర్భంగా పంత్ ప‌క్క‌టెముక‌ల గాయానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఆ గాయం నుంచి అత‌డు పూర్తిగా కోలుకోలేదని స‌మాచారం. ప్రస్తుతం అత‌డు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. ఈ నేప‌థ్యంలో నవంబర్ 19న న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో ఆడ‌డం కూడా సందేహంగా మారింది.

Sachin Tendulkar : టెస్టుల్లో స‌చిన్ రికార్డుకు చేర‌వ‌గా జోరూట్‌.. స్పందించిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌..

ఇక న్యూజిలాండ్‌-ఏతో జ‌ర‌గ‌నున్న మూడో అన‌ధికారిక మ్యాచ్‌కు పంత్ స్థానంలో తిల‌క్ వ‌ర్మ‌ను ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా.. భారత టెస్ట్ స్పెషలిస్టులు జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ రవీంద్ర జడేజాలు టెస్ట్ సిరీస్ సన్నాహాల్లో భాగంగా భారత్-ఎ త‌రుపున న్యూజిలాండ్‌-ఏతో జ‌ర‌గ‌నున్న అన‌ధికారిక మూడో టెస్టులో ఆడ‌నున్నార‌ని తెలుస్తోంది.

భార‌త‌-ఏ జ‌ట్టుకు ధ్రువ్ జురెల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. బుధవారం వరకు భారత వన్డే జట్టులో భాగంగా ఉన్న ఆల్ రౌండర్ నితీశ్‌ కుమార్ రెడ్డి కూడా ఈ జట్టులో చేరాడు. కివీస్‌తో టెస్ట్ సిరీస్ నాటికి పంత్ కోలుకోలేకపోతే.. జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.