×
Ad

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు సీఎస్‌కేకు భారీ షాక్.. 14.20 కోట్ల స్టార్ ఆట‌గాడికి గాయం!

ఐపీఎల్ 2026 (IPL 2026) సీజ‌న్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలింది.

Big blow to CSK ahead of IPL 2026 season Kartik Sharma injured

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఈ మెగాటోర్నీ ప్రారంభానికి ఓ నెల రోజులు మాత్రమే స‌మ‌యం ఉండ‌గా ఆ జ‌ట్టు ఆట‌గాడు గాయ‌ప‌డ్డాడు. దీంతో ఫ్యాన్స్‌లో ఆందోళ‌న నెల‌కొంది.

రాజ‌స్థాన్‌కు చెందిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కార్తీక్ శ‌ర్మ స్థానిక టోర్న‌మెంట్‌లో భాగంగా మేవార్ క‌ప్‌లో ఆడుతున్నాడు. 14 బంతుల్లో 39 ప‌రుగుల వ‌ద్ద బ్యాటింగ్ చేస్తుండ‌గా బౌల‌ర్ బంతిని వేసే స‌మ‌యంలో.. హ‌ఠాత్తుగా అత‌డు వికెట్ల వెనుక వైపుకు వెళ్లి కింద ప‌డుకుండి పోయాడు.

Virat Kohli : ప్ర‌మాదంలో కోహ్లీ ప్ర‌పంచ రికార్డు.. పాక్ ఆట‌గాడు క‌న్నేశాడు.. !

తీవ్ర‌మైన నొప్పితో విల‌విల‌లాడాడు. ఫిజియో వ‌చ్చి ప్రాథమిక చికిత్స అందించిన‌ప్ప‌టికి ఫ‌లితం లేకుండా పోయింది. నొప్పితీవ్రంగా ఉండ‌డంతో అత‌డు రిటైర్డ్ అయ్యాడు. అయితే.. అత‌డి గాయానికి సంబంధించిన ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ అంద‌లేదు. అది తీవ్ర‌మైన గాయ‌మా? లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఒక‌వేళ గాయం తీవ్రంగా ఉండి అత‌డు ఐపీఎల్ 2026కి దూరం అయితే అది చెన్నైకి ఓ ర‌కంగా ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

వేలంలో భారీ మొత్తానికి..

ఐపీఎల్ 2026 మెగావేలంలో కార్తీక్ శ‌ర్మ‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. రూ.14.20 కోట్ల‌ను అత‌డి కోసం వెచ్చింది. ఈ క్ర‌మంలో ప్ర‌శాంత్ వీర్‌తో క‌లిసి కార్తీక్ శ‌ర్మ ఐపీఎల్ లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన అన్‌క్యాప్డ్ ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

T20 World Cup 2026 : జింబాబ్వేను త‌క్కువ అంచ‌నా వేస్తే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా? 26న భార‌త్‌తో మ్యాచ్‌

కాగా.. వీరిద్ద‌రిని చెరో రూ.14.20 కోట్ల‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అన్‌క్యాప్డ్ ఆట‌గాళ్ల‌కు సీఎస్‌కే అంత పెద్ద మొత్తం వెచ్చించ‌డంతో ఐపీఎల్ 2026లో వీరిద్ద‌రు ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తారో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.