IND vs NZ : భార‌త్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్‌.. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు..

భార‌త్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు (IND vs NZ) భారీ షాక్ త‌గిలింది.

Big shock to New Zealand Ahead of T20I series against India two players Injury

IND vs NZ : భార‌త్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ త‌గిలింది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు.. మార్క్ చాప్‌మన్ , జాక్ ఫౌల్క్స్ గాయాల‌తో టీమ్ఇండియాతో టీ20 సిరీస్‌కు దూరం అయ్యారు. ఈ విష‌యాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. వారి స్థానాల్లో మ‌రో ఇద్ద‌రు ఆట‌గాళ్లు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

గత నెలలో జరిగిన యూరోపియన్ టీ20 లీగ్ సందర్భంగా చాప్‌మన్‌కు తొడ కండ‌రాల గాయం బారిన ప‌డ్డాడ‌ని తెలిపింది. అత‌డు ప్ర‌స్తుతం కోలుకుంటున్నాడ‌ని, భార‌త్‌తో వ‌న్డే సిరీస్ నాటికి అత‌డు జ‌ట్టులో చేరే అవ‌కాశం ఉందని, ఈ క్ర‌మంలోనే టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడ‌ని చెప్పింది.

ఆల్‌రౌండ‌ర్ జాక్ ఫౌల్క్స్ తుంటి నొప్పితో బాధ‌ప‌డుతున్నాడ‌ని తెలిపింది. అయితే.. ఎప్పుడు పూర్తిగా కోలుకుంటాడు అన్న విష‌యాల‌ను ఇప్పుడే చెప్ప‌లేమ‌ని, అత‌డు ఎప్పుడు మైదానంలోకి బ‌రిలోకి దిగుతాడ‌నే విష‌యం తెలియ‌ద‌న్నాడు. ఇక వీరిద్ద‌రి స్థానాల్లో ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్‌సన్ , ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్‌లను టీ20 జ‌ట్టులోకి తీసుకుంటున్న‌ట్లు కివీస్ బోర్డు వెల్ల‌డించింది.

భారత్‌తో జరిగే టీ20 మ్యాచ్ న‌వీక‌రించిన న్యూజిలాండ్ జ‌ట్టు ఇదే..

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్.

Sanju Samson : ధోని సొంతూరులో మ్యాచ్‌.. సంజూ శాంస‌న్‌ను ఊరిస్తున్న భారీ మైలురాయి..

భార‌త్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 22న – క్రైస్ట్‌చర్చ్‌
* రెండో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 24న – క్రైస్ట్‌చర్చ్‌
* మూడో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 27న – వెల్లింగ్టన్‌
* నాలుగో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 30న – ఆక్లాండ్‌
* ఐదో టీ20 మ్యాచ్ – నవంబ‌ర్ 1న – హామిల్టన్‌

కివీస్‌తో టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

శ్రేయ‌స్‌ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్‌), అక్షర్ పటేల్, శివ‌మ్‌ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మ‌యాంక్ యాద‌వ్, అర్ష్‌దీప్ సింగ్, భువ‌న్వేశ‌ర్ కుమార్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్.