IND vs NZ : న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌.. టీమ్ఇండియాకు భారీ షాక్..

IND vs NZ : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మంగ‌ళ‌వారం (అక్టోబ‌ర్ 27) వెల్లింగ్టన్ వేదిక‌గా మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Big Shock to Team India ahead Of 3rd T20I Against New Zealand Ishan Kishan Ruled Out

IND vs NZ : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మంగ‌ళ‌వారం (అక్టోబ‌ర్ 27) వెల్లింగ్టన్ వేదిక‌గా మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించిన భార‌త్.. మూడో మ్యాచ్‌లోనూ గెలుపొంది మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే సిరీస్ సొంతం చేసుకోవాల‌ని భావిస్తోంది. అయితే.. మూడో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. భీక‌ర ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిష‌న్ ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండ‌డం లేదు. ఈ విష‌యాన్ని బీసీసీఐ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

క్రైస్ట్ చ‌ర్చ్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిష‌న్ గాయ‌ప‌డ్డాడు. అత‌డు కండ‌రాల గాయానికి గురి అయ్యాడు. ఈ క్ర‌మంలో అత‌డు రెండో టీ20 మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో కుమార్ కుశాగ్ర ను ఎంపిక చేశారు. అయితే.. కుమార్ కుశాగ్ర‌కు రెండో టీ20 మ్యాచ్‌లో తుది జ‌ట్టులో అవ‌కాశం రాలేదు. ఆ మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ మూడో స్థానంలో ఆడాడు.

Virat Kohli : న‌వంబ‌ర్ 4 నుంచి న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్.. కోహ్లీ ఎలా సిద్ధం అవుతున్నాడో తెలుసా?

ఇక మూడో టీ20 మ్యాచ్‌కు ఇషాన్ కోలుకుంటాడ‌ని భావించాగా అలా జ‌ర‌గలేదు. అత‌డు వైద్యుల ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు బీసీసీఐ చెప్పింది. ఈ క్ర‌మంలో కుమార్ కుశాగ్ర ను మూడో మ్యాచ్‌కు సైతం కంటిన్యూ చేస్తున్న‌ట్లు వెల్లడించింది.

PAK vs ENG : ఆదివారం అద్భుతం చేసిన పాక్‌.. ఇంగ్లాండ్ పై సంచ‌ల‌న విజ‌యం.. న‌భూతో న‌భ‌విష్య‌త్..!

‘న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని మొదటి టీ20 మ్యాచ్‌లో కుడి తొడ కండరాలకు తగిలిన స్వల్ప గాయం నుండి ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు. అయితే.. అతను ఇంకా మ్యాచ్ ఆడే స్థాయికి పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించలేదు. దీనివల్ల 2026 అక్టోబర్ 27న వెల్లింగ్టన్‌లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండడు. వైద్య బృందం ఇషాన్ కోలుకునే ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. మూడో టీ20 మ్యాచ్ కోసం కుమార్ కుశాగ్ర జట్టుతోనే కొనసాగుతాడు.’ అని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.